ఇక రామ్​చరణ్​ ‘గేమ్​ఛేంజర్​’ పని అయిపోయినట్లేనా.?

ఊహించినట్లే, గేమ్​ఛేంజర్(Game Changer Movie)​ విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈసారి దెబ్బ విశ్వంభర(Vishwambhara) మీద. జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి సినిమాను ఇంకా వెనక్కిపంపి, ఆ తేదీని గేమ్​చేంజర్ ఆక్రమించింది. జరగండి.. జరగండి… అంటే ఎవరినో అనుకున్నాం. విశ్వంభర అని అనుకోలేదు.

ఇక రామ్​చరణ్​ ‘గేమ్​ఛేంజర్​’ పని అయిపోయినట్లేనా.?

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. రామ్​చరణ్​ – శంకర్​ల మూవీ గేమ్​చేంజర్​ వాయిదాల పర్వం కొనసాగుతూనేఉంది. ఈసారి తేదీ జనవరి 10, 2025. బలైంది హీరో నాన్నగారు మెగాస్టార్​ చిరంజీవి. ఆయన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర ఆ తేదీన విడుదల కావాల్సిఉంది. అంతా రెడీ చేసుకున్నారు కూడా. కానీ గేమ్​చేంజర్​ పూర్తి కాదు కదా. శంకర్​ బలిమేకల లిస్టులో రామ్​చరణ్(Shankar’s Scape goat)​ చేరిపోయాడు. ఇండియన్​ 2, 3(Indian2 & 3) కోసం గేమ్​చేంజర్​ను శంకర్​ పక్కనపెట్టేసాడని అభిమానులు ఆవేశపడ్డారు. అభిమానులు, దిల్​ రాజు ఈ సినిమాను వదిలేసుకుంటే, ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు.

ఇప్పుడు గేమ్​చేంజర్​కు మరో బలి – విశ్వంభర. గేమ్​చేంజర్​కు దారి ఇవ్వడం కోసం చిరంజీవి(Megatar Chiranjeevi) ఏకంగా మే9, 2025కు వెళ్లిపోయాడని సమాచారం. మే9 ఆయనకు అచ్చొచ్చిన రోజు. జగదేకవీరుడు సహా చిరంజీవి భారీ హిట్​ చిత్రాలు మే9నే విడుదలయ్యాయి. కానీ, టీజర్​(Teaser) ఫలితం మరోలా వస్తోంది. విశ్వంభర గ్రాఫిక్స్​(Graphics trolled)ను సోషల్​మీడియాలో ఏకిపారేస్తున్నారు. సీన్​ టు సీన్​ను పోస్ట్​మార్టం చేసి, ఏది ఎక్కన్నుంచి ఎత్తేసారు? సిజీ వర్క్​ నాణ్యత మరీ నాసిరకంగా ఉందని.. రకరకాల పోస్టులు షేర్ల మీద షేర్లు అవుతున్నాయి. టైమ్​ ఇంకా వుంది కాబట్టి, వశిష్ట వీటిని బాగుచేసుకుంటే బెటర్​ అనే సలహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆదిపురుష్​ దర్శకుడు ఓం రావత్​తో వశిష్టను పోలుస్తున్నారు.

ఇక గేమ్​చేంజర్​ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీలేదని, వచ్చినప్పుడు వచ్చి, ఎవరికీ తెలియకుండా వెళ్లిపోతుందని సినీవర్గాల గుసగుసలు. ఇక రామ్​చరణ్​, బుచ్చిబాబు సినిమా మీద కాన్​సంట్రేట్​ చేయడం చాలా మంచిదని అంటూ, శంకర్​ రాజమౌళి(SS Rajamouli) మీద ఉన్న అసూయను రామ్​చరణ్​ మీద తీర్చుకుంటున్నాడని కూడా అభిమానులు ఓ మెట్టు ఎక్కి మరీ కామెంట్లు పెడుతున్నారు.

 

Tags: .