Rashmi Goutham| చిన్నారిపై కుక్క దాడి త‌ర్వాత మ‌ళ్లీ నిప్పు రాజేసిన ర‌ష్మీ.. పిల్ల‌ల్ని కంటే స‌రిపోదు..!

Rashmi Goutham| ఈ మ‌ధ్య కాలంలో చిన్నారుల‌పై కుక్క‌ల దాడులు భీబ‌త్సంగా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గ‌త ఏడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క‌లు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడి ఘ‌ట‌న‌ని మ‌ర‌చిపోక‌ముందే ఇప్పుఉ తాండూరులోలో

  • By: sn    cinema    May 15, 2024 6:43 AM IST
Rashmi Goutham| చిన్నారిపై కుక్క దాడి త‌ర్వాత మ‌ళ్లీ నిప్పు రాజేసిన ర‌ష్మీ.. పిల్ల‌ల్ని కంటే స‌రిపోదు..!

Rashmi Goutham| ఈ మ‌ధ్య కాలంలో చిన్నారుల‌పై కుక్క‌ల దాడులు భీబ‌త్సంగా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గ‌త ఏడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క‌లు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడి ఘ‌ట‌న‌ని మ‌ర‌చిపోక‌ముందే ఇప్పుఉ తాండూరులోలోని బసవేశ్వర నగర్‌లో అలాంటి ఘటన మ‌రొక‌టి చోటుచేసుకుంది. దత్త, లావణ్య దంపతుల ఐదు నెలల కుమారుడు కుక్కల దాడిలో మ‌ర‌ణించ‌డంతో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయారు. అయితే బాలుడి మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబ స‌భ్యులు కోపంతో కుక్క‌ని కూడా చంపేశారు. ఇక ఈ వార్త నెట్టింట వైర‌ల్ కాగా, దానిపై ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. కుక్కని చంపినందుకు త‌ల్లిదండ్రుల‌పై కేసు పెట్టాల‌ని ర‌ష్మీ అంట‌ది అని అన్నాడు.

దానికి ర‌ష్మీ స్పందిస్తూ.. అవును.. చిన్నారిని త‌ల్లిదండ్రులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారు. కుక్క దాడి చేస్తున్న స‌మ‌యంలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు. బాబు ఏడుపు వారికి వినిపించలేదా.. ? జంతువులపై ఈ త‌ప్పుడు ప్ర‌చారాలు ఆపండి. తెలివి త‌క్కువ‌గా వ్య‌వ‌హ‌రించే తల్లిదండ్రుల వెయ్యి వీడియోల‌ని నేను షేర్ చేయ‌గ‌ల‌ను. పిల్ల‌ల జీవితాల‌ని ఎవ‌రు రిస్క్‌లో పెట్టింది. పిల్లలను కనగానే సరిపోదు క‌దా వాళ్ళను భద్రంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులదే అని రష్మీ పరోక్షంగా చెప్పుకురాగా, ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టంట వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ర‌ష్మీ ట్వీట్‌పై మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. నిజంగా మీకు బ్రెయిన్ లేద‌ని అర్ధ‌మైంది. ఇలా అంటున్నందుకు ఏ మాత్రం త‌ప్పుగా ఫీల్ కావ‌ద్దు అంటూ కామెంట్ చేసాడు. దీనికి స్పందించిన ర‌ష్మీ గౌత‌మ్.. ‘నాకు బుర్రలేదు.. కానీ మీకు ఉంది కదా.. కనడమే కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా పిల్ల‌ల‌ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. పెంపుడు జంతువులు ఉన్న ప‌రిస‌ర ప్రాంతాల‌లో పిల్ల‌ల‌ని అలా వ‌దిలి వేయ‌వ‌ద్దు అంటూ ర‌ష్మీ గౌత‌మ్ కామెంట్ చేయ‌గా, ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తోంది.