విజయ్ దేవరకొండని ముద్దుగా రష్మిక ఏమని పిలుచుకుంటుందంటే..!

గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ-రష్మిక జంట నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని పలువురు చెప్పుకొస్తుండగా, వారు మాత్రం దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ తొలిసారి గీత గోవిందం మూవీలో కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మళ్లీ మెరిసారు. ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయిన కూడా ఇందులో ముద్దు సన్నివేశాలలో నటించి రచ్చ చేశారు. ఈ సినిమా తర్వాత వారిద్దరు కలిసి నటించింది లేదు కాని జంటగా తిరుగుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత దర్శనం ఇవ్వడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడం ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకి బలం ఇచ్చినట్టు అయింది.
తమ మధ్య ఎలాంటి బంధం లేదనివిజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నా కూడా వారు చేసే పనులతో మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. నేడు రష్మిక మంధాన బర్త్ డే కాగా, తన బర్త్ డే సెలబ్రేషన్‌లో భాగంగా రష్మిక అబుదాబి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. వారి ఇద్దరి స్టోరీలని అబ్జర్వ్ చేస్తే అందులో కామన్ పాయింట్‌గా నెమలి కనిపించింది. దీంతో ఈ ఇద్దరు కూడా దుబాయ్‌లోనే ఉన్నారని టాక్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రష్మిక, విజయ్ కి పెట్టుకున్న నిక్ నేమ్ ఏంటో తెలియజేసింది. బాలీవుడ్ లో నేహా ధుపియా నిర్వహించే పోడ్‌కాస్ట్ లో రష్మిక మాట్లాడుతూ విజయ్ దేవరకొండని తాను ముద్దుగా ‘విజ్జు’ అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక విజయ్ గురించి మాట్లాడుతూ.. తాను ఎంత బిజీలో ఉన్నా కూడా ఫోన్ లో తప్పక అందుబాటులో ఉంటారని తెలియజేసింది. తనకు వృత్తి పరంగా విలువైన సలహాలు కూడా ఇస్తాడని, మంచి థెరపిస్ట్‌గా కూడా ఉంటాడని రష్మిక కామెంట్ చేయడం విశేషం. చూస్తుంటే ఈ జంట సైలెంట్‌గా ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కుతుందేమో అనే అనుమానం అందరిలో కలుగుతుంది.ఇక నేడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కావడం, ఈ రోజే రష్మిక బర్త్ డే కావడం, సినిమాలో రష్మిక స్పెషల్ చేయడం అన్ని కూడా హైప్ పెంచుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తెలుగు , తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.