మారు వేషంలో ‘కింగ్డమ్‌’ సినిమా చూసిన రష్మిక మందన

కింగ్‌డమ్ సినిమా విజయంపై రష్మిక మందన్న మారు వేషంలో థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. విజయ్ దేవరకొండ అభిమానిగా, రష్మిక స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విజయంపై రష్మిక పోస్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మారు వేషంలో ‘కింగ్డమ్‌’ సినిమా చూసిన రష్మిక మందన

విధాత: నేషనల్ క్రష్ రష్మిక మందన మారు వేషంలో ‘కింగ్డమ్‌’ సినిమా చూశారని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. కింగ్డమ్ సినిమా విజయంపై మీడియాతో మాట్లాడన నాగవంశీ ”కింగ్డమ్’ సినిమా అంచనాలను అందుకుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సినిమా అయినా నిర్మాతగా ఒత్తిడి సహజం అని..రూ.5కోట్ల సినిమా అయినా.. రూ.500కోట్లదైనా ఒత్తిడి సహజమేనన్నారు. సాంకేతికంగా హాలీవుడ్‌ స్థాయిలో ఉందని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. విజయ దేవరకొండ ప్రస్తుతానికి థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేదని..అయితే ఆయన ఫ్యాన్ రష్మిక మందన మాత్రం ‘కింగ్డమ్‌’ను ఎవరికీ తెలియకుండా మారు వేషంలో భ్రమరాంబిక థియేటర్ కు వెళ్లి చూశారని వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమాపై ఎక్స్ వేదికగా రష్మిక స్పందిస్తూ ‘నీకు, నిన్ను ప్రేమిస్తున్నవారికి ఈ విజయం ఎంత ముఖ్యమో నాకు తెలుసు.. మనం కొట్టినం’ అంటూ వ్యాఖ్యతో ఓ పోస్ట్‌ని పంచుకున్నారు. విజయ్‌ కూడా ‘మనం కొట్టినం’ అంటూ ప్రతిస్పందించారు. ఇప్పుడు ఏకంగా మారు వేషంలో వెళ్లి కింగ్డమ్ సినిమా చూడటంతో విజయ్ పట్ల రష్మిక ఆసక్తికి నిదర్శనమని సినీ వర్గాల టాక్. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్, రష్మిక మందన్న మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారిందని భవిష్యత్తులో వారిద్దరు పెళ్లి చేసుకోబోతారన్న వార్తలు తరుచు వినిపిస్తున్నాయి. ఇందుకు వారిద్దరు తరుచు ప్రైవేట్ గా కూడా జంటగా కనిపిస్తుండం..ఒకరి సినిమాల పట్ల మరొకరు కామెంట్లతో ప్రమోషన్ నిర్వహించడం కూడా మరింత ఊతమిస్తుంది.