Renu Desai| మీ వలన నా కూతురు చాలా ఏడ్చింది..ఆమె ఏడుపు తప్పక తగులుతుందంటూ రేణూ పోస్ట్
Renu Desai| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది. కాని పలు కారణాల వలన వారిద్దరు విడిపోయారు. వీరు విడిపోయి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా కూడా రేణూ దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదినగానే పిలుచుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత రేణూ దేశాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె పలు ఫొటోలు షేర్ చేస్తున్న సమయంలో కొందరు నెటిజ

Renu Desai| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది. కాని పలు కారణాల వలన వారిద్దరు విడిపోయారు. వీరు విడిపోయి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా కూడా రేణూ దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదినగానే పిలుచుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత రేణూ దేశాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె పలు ఫొటోలు షేర్ చేస్తున్న సమయంలో కొందరు నెటిజన్స్ ఆమెని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. రేణూనే కాకుండా ఆమె పిల్లలు అయిన అకీరా, ఆద్యలని కూడా టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో రేణూ దేశాయ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అకీరా గురించి నెగెటివ్ కామెంట్స్ చేసిన వారికి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇక వాళ్లు చేసే ట్రోలింగ్ వలన తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ ప్రశ్నించింది. అసలు మీకు ఎమోషన్స్ ఉండవా? ఈ ఫొటోను నేను క్రాప్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కుళ్లు జోకులు వేస్తూ ఎందుకలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మీకు కుటుంబం ఉంటుంది కదా, నా గురించి చెత్త జోకులు వేస్తూ పెట్టిన పోస్ట్ చూసి నా కూతురు ఏడ్చింది. మీకు కూడా అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారు కదా, ఎందుకిలా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. జంతువుల్లా ఎందుకు మారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదు. మీ దగ్గర ఇంటర్నెట్ ఉందని, సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారా అంటూ ఫైర్ అయింది.
నా కూతురు ఎంత బాధపడి ఉంటుందో అర్ధం చేసుకోండి. ఆమె ఏడుపు మీకు తప్పక తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్ పేజ్ అడ్మిన్‌లకి ఒక తల్లి ఇచ్చే శాపం కచ్చితంగా తగలడం ఖాయం. ఈ పోస్ట్ పెట్టే ముందు వందసార్లు ఆలోచించాను. కాని నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అంటూ రేణూ దేశాయ్ చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసింది. పోలెనా, మార్క్ (పవన్ – లెజినోవా పిల్లలు) కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో తప్పక ప్రభావితులవుతారు అని కూడా రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో తెలియజేసింది. మనషులు ఇంత దారుణంగా మారడం సిగ్గు చేటు అంటూ రేణూ పేర్కొంది.