Renu Desai| ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ వస్తుంది. అకీరా ఇటీవల తన తండ్రితో కలిసి చంద్రబాబు నాయుడిని కలిసాడు.ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. ప్రధా
Renu Desai| ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ వస్తుంది. అకీరా ఇటీవల తన తండ్రితో కలిసి చంద్రబాబు నాయుడిని కలిసాడు.ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. ప్రధానిని కలవడంపై రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అసలు అకిరా వెళ్లిందే పవన్ కళ్యాణ్ వల్ల కానీ, ఆయన ఫోటో లేకుండా క్రాప్ చేసి కేవలం అకిరా ఉన్నదే షేర్ చేయడమేంటని ఓ నెటిజన్ రేణు దేశాయ్‌ని అడిగారు. దానికి రేణూ స్పందిస్తూ.. మీరు ఏడ్చింది చాలు. ఇది క్రాప్డ్ ఫోటో కాదు. కేవలం అకిరా, పీఎం గారు మాత్రమే దిగిన ఒరిజినల్ ఫోటో అని పేర్కొంది.
పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏమైనా చెప్పోచ్చు కదా వదిన గారు అని ఓ నెటిజన్ అడగగా, నేను ఏం చెప్పినా అందరు అటెన్షన్ కోసం మాట్లాడుతున్నా అంటారు. ఏదైనా నేను చెప్పాలి అనుకుంటే నేరుగా ఆయనకే(పవన్ కళ్యాణ్) ఫోన్ చేసి చెబుతాని పేర్కొంది. ఇక అకీరా మోదీ మధ్య ఏం చర్చ నడిచింది అనే దాని గురించి కూడా రేణూ పేర్కొంది. మోదీ అకిరా హైట్ గురించి మాట్లాడారని, బాస్కెట్ బాల్ ఆడతాడా? అంటూ హైట్ గురించి చమత్కిరించారట. అప్పుడు అకీరా సిగ్గుపడ్డాడని రేణూ పేర్కొంది. ఇక రేణూ దేశాయ్ 12ఏళ్లుగా సింగిల్‌గానే ఉంటోంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేణు దేశాయ్. రెండో పెళ్లిపై స్పందించింది.
తాను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీనే అని, కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. గతంలో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న రేణూ అందుకు కారణం చెప్పింది. ఆ సమయంలో తమ పిల్లలు అకీరా, ఆద్య చిన్నగా ఉన్నారు, వారికి కేర్ టేకర్ కావాలి. వారికి తోడు కావాలి. తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైమ్ కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు పిల్లలు ఒంటరైపోతారు. అందుకే మూడేళ్ల తర్వాత వారికి ఫ్రెండ్స్ ఏర్పడతారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవరు, కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవతారు. నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి, అందరిలా నేను కూడా మ్యారేజ్లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పింది రేణూ . తాను సిక్‌గా ఉన్నప్పుడు నా పిల్లలు చాలా ఫీలవుతారు. అందుకే వారు నన్ను మ్యారేజ్ చేసుకోమని అంటుంటారు అని రేణూ పేర్కొంది