Sapthami Gowda | భర్తతో ఎఫైర్‌ ఉందన్న హీరో భార్య..! కోర్టును ఆశ్రయించిన కాంతార బ్యూటీ సప్తమి గౌడ..!

Sapthami Gowda | కాంతార మూవీతో మంచి పేరును సంపాదించుకున్నది హీరోయిన్‌ సప్తమి గౌడ. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత సప్తమికి ఆఫర్లు క్యూకట్టాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్‌’లో సప్తమి మెరిసింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా.. సౌత్‌, నార్త్‌లో సప్తమి క్రేజ్‌ పెరిగింది. కన్నడతో పాటు తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఈ నటి ప్రస్తుతం కోర్టు మెట్లు ఎక్కారు.

ఓ హీరో భార్య చేసిన ఆరోపణలపై ఆమె కోర్టును ఆశ్రయించారు. దివంగత కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ కుటుంబానికి చెందిన యువరాజ్ కుమార్‌తో సప్తమి ఎఫైర్ నడుపుతుందనే వార్తలు శాండల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం యువరాజ్ భార్య శ్రీదేవి వరకు చేరింది. అయితే, భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించి విడాకులు కోరింది. అదే సమయంలో ఆమె భర్త యువరాజ్‌ సైతం తన భార్యే వేధింపులకు పాల్పడుతోందని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టుకు కోరాడు. అయితే, వ్యవహారంపై శ్రీదేవి స్పందిస్తూ హీరోయిన్‌ సప్తమి గౌడతో తన భర్తతో ఎఫైర్‌ నడిపిస్తోందని.. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే పేర్కొంది.

తాను అమెరికా వెళ్లిన సందర్భంలో సప్తమితో కలిసి తన భర్త యువరాజ్‌ కలిసే ఉన్నాడని.. తాజాగా సప్తమి గౌడ కోసం తనను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని శ్రీదేవి ఆరోపించింది. అయితే, వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో కలకలం రేపాయి. దాంతో శ్రీదేవిపై లీగల్‌ చర్యలకు సప్తమి ఉపక్రమించింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా శ్రీదేవి వ్యహరించిందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సప్తమి పిటిషన్‌ మేరకు శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఓ వైపు శ్రీదేవి-యువరాజ్‌ దంపతుల విడాకుల మధ్య.. సప్తమి కేసు ఎటు మలుపుతిరుగుతుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.