Saripodhaa Sanivaaram|ఈ చిన్న త‌ప్పులు చేయ‌క‌పోయి ఉంటే నాని ఖాతాలో భారీ హిట్ ప‌డి ఉండేది..!

Saripodhaa Sanivaaram| నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మినిమం గ్యారెంటీ సినిమాలు చేస్తూ వ‌స్తున్న నాని రీసెంట్‌గా స‌రిపోదా శ‌నివారం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. గతేడాది దసరా చిత్రంతో రూ.100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టినాని, తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ను తన

  • By: sn    cinema    Aug 30, 2024 8:53 AM IST
Saripodhaa Sanivaaram|ఈ చిన్న త‌ప్పులు చేయ‌క‌పోయి ఉంటే నాని ఖాతాలో భారీ హిట్ ప‌డి ఉండేది..!

Saripodhaa Sanivaaram| నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మినిమం గ్యారెంటీ సినిమాలు చేస్తూ వ‌స్తున్న నాని రీసెంట్‌గా స‌రిపోదా శ‌నివారం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. గతేడాది దసరా చిత్రంతో రూ.100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టినాని, తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో అంతకుముందు అంటే సుందరానికి సినిమా చేశాడుకానీ అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆత్రేయ మీద నమ్మకంతో మరో సినిమాకు అవకాశమిచ్చాడు నాని.

ఈ సినిమా స్టార్టింగ్ మంచి బ్యాంగ్ తో స్టార్ట్ అయినప్పటికీ సినిమా సెకండ్ ఆఫ్ లో కాస్త ల్యాగ్ కావ‌డంతో అభిమానులు కాస్త డిస్పాయింట్ అయ్యారు. అంతేకాదు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా కుదరలేదు, జాక్స్ బిజోయ్ మ్యూజిక్ లో కొన్ని డ్రాబ్యాక్స్ లేకపోలేదు. నానికి సోకులపాలెం ప్రజల మధ్య వ‌చ్చే కొన్ని స‌న్నివేశాల‌లో పెద్ద‌గా ఎమోష‌న్స్ పండిన‌ట్టు క‌నిపించ‌లేదు. హీరోని క‌నిపెట్టేందుకు సూర్య పెద్ద‌గా క‌ష్ట‌ప‌డిన‌ట్టు అనిపించ‌లేదు. చిన్న చిన్న త‌ప్పుల‌ని క‌నుక స‌రి చేసుకొని ఉండి ఉంటే ఈ చిత్రం మ‌రింత సూప‌ర్ హిట్ అయ్యేద‌ని కొంద‌రి ఆడియ‌న్స్ టాక్. సినిమాలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ దక్కింది.

ఎస్ జే సూర్య నటనను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉంది.. నానికి మంచి ఎలివేషన్లు ఇచ్చాడు దర్శకుడు. ఇవి తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోతాయి. ఈ సినిమా నాని ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించేలా ఉంటుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ తోపాటు విదేశాల్లో కూడా సరిపోదా శనివారం సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని, నాని మరో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే అంటున్నారు.