Sharukh Khan|నేను నిన్ను ప్ర‌గ్నెంట్ చేస్తాన‌న్న షారూఖ్ ఖాన్.. షాక్‌లో ప్రీతి జింతా

Sharukh Khan| బాలీవుడ్ హీరోయిన్, ఐపీఎల్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతి జింతా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో అద్భుత‌మైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. హిందీలో ఫుల్ ఫేమ‌స్ అయిన ప్రీతి జింతా తెలుగులో కూడా అద‌ర‌గొట్టింది. 1998 లో వచ్చిన ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో ఎంత అందంగా, యవ్వనంగా కనిపించి అంద‌రి మ‌న‌స్సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుం

  • By: sn    cinema    Aug 18, 2024 7:42 AM IST
Sharukh Khan|నేను నిన్ను ప్ర‌గ్నెంట్ చేస్తాన‌న్న షారూఖ్ ఖాన్.. షాక్‌లో ప్రీతి జింతా

Sharukh Khan| బాలీవుడ్ హీరోయిన్, ఐపీఎల్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతి జింతా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో అద్భుత‌మైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. హిందీలో ఫుల్ ఫేమ‌స్ అయిన ప్రీతి జింతా తెలుగులో కూడా అద‌ర‌గొట్టింది. 1998 లో వచ్చిన ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో ఎంత అందంగా, యవ్వనంగా కనిపించి అంద‌రి మ‌న‌స్సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. అయితే అప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్‌గా ఉంది ప్రీతిజింతా. అయితే ప్రీతి జింతా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో కూడా క‌లిసి ప‌లు సినిమాలు చేసింది. ఈ క్ర‌మంలోనే ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోను ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉంది.

అప్పుడ‌ప్పుడు వారిద్ద‌రు స‌ర‌దగా క‌లుస్తూ సంద‌డి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా షారూఖ్‌- ప్రీతిజింతాకి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఓ ఇంట‌ర్వ్యూలో ప్రీతిజింతాని షారూఖ్ ఖాన్.. ‘మీరు ప్రెగ్నెంటా’ అని షారుక్ సరదాగా అడుగుతారు. అప్పుడు ఆమె సిగ్గుపడతారు. దానికి ‘మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్​ చేస్తా’నని షారుక్ మళ్లీ సరదాగా అంటారు. అప్పుడు ప్రీతీ షాక్​కు గురై ఫ‌న్ మూడ్‌కి వెళుతుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, నెటిజ‌న్స్ భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహ‌బంధం ఉన్న కార‌ణంగానే షారూఖ్ అలా అని ఉంటాడ‌ని కొంద‌రు అంటుండ‌గా, మరి కొంద‌రు ఆయ‌న కామెంట్స్‌పై ఫైర్ అవుతున్నారు.

ఈ ఏడాది మేలో ప్రీతీ జింటా సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్​ను నిర్వహించారు. అభిమాని ఒకరు షారుక్ ఖాన్ గురించి చెప్పాల్సిందిగా అడిగారు. ” షారుక్ ప్రతిభకు ఒక పవర్‌ హౌస్ లాంటివారు. ఆయనతో పనిచేయడానికి చాలా మంది ఇష్టపడతారు. సరదాగా ఉండే నటుల్లో షారుక్ ఒకరు. ఆయనతో ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. షారుక్ నుంచి దిల్ సే సినిమా షూటింగ్ సమయంలో చాలా నేర్చుకున్నాను అంటూ ప్రీతి జింతా బ‌దులిచ్చింది. ఇక చాలా కాలంగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న ప్రీతి త్వరలో లాహోర్ 1947లో సన్నీ దేఓల్​తో కలిసి ఓ సినిమా చేయ‌నున్నారు. ప్రస్తుతం షారుక్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.