Biker Glimpse : హీరో శర్వానంద్ ‘బైకర్‌’ మూవీ గ్లింప్స్ విడుదల

శర్వానంద్ బైకర్‌ గ్లింప్స్‌ విడుదలైంది. రేసింగ్ థ్రిల్, కుటుంబ అనుబంధాలు మేళవించిన స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.

Biker Glimpse : హీరో శర్వానంద్ ‘బైకర్‌’ మూవీ గ్లింప్స్ విడుదల

విధాత : హీరో శర్వానంద్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ‘బైకర్‌’మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ లో ఇక్కడ ప్రతి బైకర్ కు ఓ కథ ఉంటుంది..సమయంతో పోరాడే కథ..చావుకు ఎదురెళ్లే కథ..ఏం జరిగినా పట్టువదలని మొండోళ్ల కథ..గెలవడం గొప్ప కాదు..చివరిదాక పోరాడటం గొప్ప అంటూ ఆసక్తికరంగా సాగింది. గ్లింప్స్ లో శర్వానంద్ బైక్ రేసింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బైకర్ గా శర్వానంద్ తన పాత్ర కోసం బాడీ మేకోవర్ కోసం తీవ్రంగా శ్రమించడం గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ‘బాహుబలి: ది ఎపిక్, మాస్‌ జాతర’ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ గ్లింప్స్‌ చూపించబోతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ గ్లింప్స్ చూడవచ్చు.

మూడు తరాల బైక్ రేసింగ్ కథ, కుటుంబ అనుబంధాలతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బైక్ రేసర్ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. 1990-2000మధ్య సాగిన రేసింగ్ థీమ్ కథతో సినిమా రూపొందుతుంది. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకి కెమెరా: జె. యువ రాజ్, మ్యూజిక్ జిబ్రాన్ అందిస్తున్నారు.

‘బైకర్‌’మూవీ షూటింగ్ లో ఉండగానే శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న‌ “నారీ నారీ నడుమ మురారి” వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో “భోగి” , శ్రీను వైట్ల తో మరో కొత్త ప్రాజెక్ట్‌లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.