Jatadhara Movie Dhana Pisaachi Lyrical Song | భయపెట్టిన ధన పిశాచి సోనాక్షి సిన్హా

జటాధరలో ధన పిశాచి సాంగ్‌తో సోనాక్షి సిన్హా భయపెట్టిన నటన, ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆకట్టుకున్న లిరికల్ వీడియో.

Jatadhara Movie Dhana Pisaachi Lyrical Song | భయపెట్టిన ధన పిశాచి సోనాక్షి సిన్హా

విధాత : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ‘జటాధర’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. సుధీర్‌బాబు హీరోగా పాన్‌ ఇండియాలో స్థాయిలో వెంకట్‌ కల్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘ధన పిశాచి’ పాట లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పాటలో ధన పిశాచిని ఆరాధిస్తూ సోనాక్షి సిన్హా భయపెట్టే నటనతో..ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తన విశాలమైన నేత్రాలతో పాత్రను టెర్రిఫిక్ గా రక్తికట్టించారు. శ్రీహర్ష రాసిన ఈ పాటను సాహితి చాగంటి పాడారు. సమీర కొప్పికర్‌ స్వరాలు సమకూర్చారు. నవంబరు 7న ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీ కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలతో కొనసాగనుందని సమాచారం.

ఇటీవలే ఈ సినిమా నుంచి ‘సోల్ ఆఫ్ జటాధర’ అనే మరో థీమ్ సాంగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘ఓం నమః శివాయ’ మంత్రంతో సాగే ఆ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజీవ్ రాజ్ స్వరపరిచిన ఆ పాటకు కూడా మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.