Vishal|విశాల్‌ని పెళ్లి చేసుకుంటానంటూ యాంక‌ర్ కామెంట్స్.. సిగ్గుతో చ‌చ్చిపోయాడుగా..!

Vishal| త‌మిళ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌మిళ స్టార్ హీరోగా ఓ వెలుగు వెల‌గిన విశాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో ఆయనను తమిళ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు భావించరు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రత్నం' సినిమా ఈ నెల 26వ తేదీన విడుద‌ల

  • By: sn    cinema    Apr 21, 2024 1:40 PM IST
Vishal|విశాల్‌ని పెళ్లి చేసుకుంటానంటూ యాంక‌ర్ కామెంట్స్.. సిగ్గుతో చ‌చ్చిపోయాడుగా..!

Vishal| త‌మిళ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌మిళ స్టార్ హీరోగా ఓ వెలుగు వెల‌గిన విశాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో ఆయనను తమిళ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు భావించరు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘రత్నం’ సినిమా ఈ నెల 26వ తేదీన విడుద‌ల కానుండ‌డంతో మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా విశాల్ న‌టించిన చిత్రం భారీగా రిలీజ్ అవుతుండడంతో.. విశాల్ తెలుగులో కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. రీసెంట్‌గా మూవీకి సంబంధించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో విశాల్‌కి.. ఓ లవ్లీ సంఘటన ఎదురైంది. ప్రముఖ యాంకర్ స్రవంతి చొకారపు ఈవెంట్‌ని హోస్ట్ చేయ‌గా, ఈవెంట్ ని స్టార్ట్ చేసేటప్పుడు స్రవంతి తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటనని తెలియ‌జేస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. విశాల్ గారు మీతో ఒక విషయం చెప్పాల‌ని ఉంది. మీ పందెం కోడి సినిమా చూసినప్పుడు నేను మా అమ్మతో నేను పెళ్లి చేసుకుంటే ఈయన్నే చేసుకుంటా అని చెప్పాను. అలా చెప్పిన నేను ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని డైరెక్ట్‌గా క‌లుసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.ఇప్పుడు మిమ్మ‌ల్ని ఇలా చూసిన‌ప్ప‌టి నుండి నా లోప‌ల సీతాకోక చిలుక‌లు ఎగురుతున్నాయి. గ‌తంలో ఎప్పుడు నాకు ఇలా క‌ల‌గ‌లేదు అని పేర్కొంది.

స్ర‌వంతి మాట‌ల‌కి స్టేజ్ కింద ఉన్న విశాల్ సిగ్గుతో తెగ న‌వ్వుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే విశాల్ ఇంకా స్టిల్ బ్యాచిల‌ర్ అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌లువురితో ప్రేమాయ‌ణం న‌డిపంచాడ‌నే టాక్ ఉంది.అంతేకాదు ఆయ‌నకి ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. కాని అనుకోని విధంగా అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడ విశాల్ పెళ్లి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ విశాల్ మాత్రం పెళ్లి మాట తీసుకు వస్తుంటే.. ప్రభాస్ పేరు చెబుతూ తప్పించుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకున్నా తరువాత నేను చేసుకుంటా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశాల్ ర‌త్నం సినిమాని హ‌రి తెర‌కెక్కిస్తున్నాడు. భరణి, పూజ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వారి కాంబోలో ఈ సినిమా రాబోతుంది.