Sreeleela|బాయ్ ఫ్రెండ్‌తో ఫారెన్ ట్రిప్ వేసిన శ్రీలీల‌..ఆ కుర్రాడి గురించి ఆరాలు తీస్తున్న నెటిజన్స్

Sreeleela|అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి సంద‌డి చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి

  • By: sn    cinema    Oct 18, 2024 8:16 PM IST
Sreeleela|బాయ్ ఫ్రెండ్‌తో ఫారెన్ ట్రిప్ వేసిన శ్రీలీల‌..ఆ కుర్రాడి గురించి ఆరాలు తీస్తున్న నెటిజన్స్

Sreeleela|అందాల ముద్దుగుమ్మ శ్రీలీల(Sreeleela) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి సంద‌డి చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) వంటి స్టార్ హీరోల‌తో న‌టించిన ఈ ముద్దుగుమ్మ‌కి స‌క్సెస్‌లు లేక కాస్త డీలా ప‌డంది. ప్ర‌స్తుతం శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని తెలుస్తుండ‌గా, బాలీవుడ్ (Bollywood)ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయింద‌ని అంటున్నారు.. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తుండ‌గా, ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. శ్రీలీల త‌మిళంపై ఫోక‌స్ పెట్టింద‌ని కూడా అంటున్నారు.అయితే ఇప్పుడు శ్రీలీల ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి (Marriage)చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు కార‌ణం శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫోటోలు.

శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) కొన్ని ఫొటోలను షేర్ చేయ‌గా, వాటిని శ్రీలీల ఫారెన్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది. అయితే ఈ శ్రీలీల షేర్ చేసిన ఫొటోల్లో ఓ వ్యక్తి కూడా కనిపించాడు. శ్రీలీల ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్ విండో నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను నైట్ మోడ్‌లో గమనించవచ్చు. అలాగే ఈ ఫోటోల్లోని ఒక దానిలో శ్రీలీల ఎవరో కుర్రాడితో మాట్లాడుతున్నట్లుగా క‌నిపించ‌గా, త‌ను ఎవరు..? శ్రీలీల సడెన్‌గా పారిస్ ట్రిప్ ఎందుకు వెళ్లింది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంప‌దీసి అత‌ను శ్రీలీల బాయ్ ఫ్రెండ్(Boy Friend) కాదు క‌దా, అత‌డిని పెళ్లి చేసుకునే ఉద్దేశం శ్రీలీల‌కి ఉందా ఏంటా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.