Sudeep| అమ్మ‌బాబోయ్.. కిచ్చా సుదీప్‌కి అంత పెద్ద కూతురు ఉందా.. నిజంగా ఇది షాకింగే..!

Sudeep| కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆ భాష‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుదీప్ తెలుగులోను ప‌లు చిత్రాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్‌ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్

  • By: sn    cinema    Aug 26, 2024 10:01 AM IST
Sudeep| అమ్మ‌బాబోయ్.. కిచ్చా సుదీప్‌కి అంత పెద్ద కూతురు ఉందా.. నిజంగా ఇది షాకింగే..!

Sudeep| కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆ భాష‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుదీప్ తెలుగులోను ప‌లు చిత్రాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్‌ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ చిత్రంలో విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ప్రభాస్ బాహుబలి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో క‌నిపించి అల‌రించాడు.

ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. సపోర్టింగ్ రోల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు కన్నడ బాక్సాఫీసును శాసిస్తున్నాడు. 1997 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుదీప్ ఇప్పటికీ అదే యంగ్ అండ్ ఎనర్జటిక్ ఫెర్మామెన్స్‌తో ప్రేక్ష‌కులని థ్రిల్ చేస్తున్నాడు. అయితే సుదీప్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాలు జ‌నాల‌కి పెద్ద‌గా తెలియ‌దు. ఈయ‌న ప్రియా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. కూతురు అంటే పది, పదిహేనేళ్ల కూతరు అనుకుంటే ప‌ప్పులో కాలిసిన‌ట్టే.. ఆయనకు 20 ఏళ్ల కూతురుంది. ఆ విష‌యం తెలిసిన వారంద‌రు కూడా ఏంటీ సుదీప్‌కు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంత ఆమె పేరు ఏంటి అనుకుంటున్నారా శాన్వీ సుదీప్

సుదీప్‌కే 20 ఏళ్ల కూతురు ఉంటే సుదీప్ వయసు ఎంతు ఉంటుందో గెస్ చేయగలరా? యంగ్ హీరోలా స్మార్ట్‌ గా, స్టైలిష్ గా కనిపించే అతని వయసు 52 ఏళ్లు. ఇక సుదీప్ కూతురు ప్ర‌స్తుతం చ‌ద‌వుకుంటూనే సింగ‌ర్‌గాను స‌త్తా చాటుతుంది. కిచ్చా సుదీప్ తన మేనల్లుడు సంచిత్ సంజీవ్‌ను పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండ‌గా ఇందులో శాన్వి త‌న గాత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ఘా ఉండే శాన్వి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది.