Heroine|ఈ హీరోయిన్ గౌన్ తయారీకి నెల రోజుల సమయం పట్టిందా.. అంత స్పెషల్ ఏంటి?
90 లో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అందాల ముద్దుగుమ్మ టబు. ఈ భామ అంటే యూత్ పడిచచ్చిపోయేవారు. ఈ టాలీవుడ్ బ్యూటీ వెండి తెరపై కనిపిస్తే చాలు కుర్రాళ్లు పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు. ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ అందంతో మంత్రముగ్ధులని చేస్తుంటుంది. తెలుగు, హిందీ భాషలలో నటించిన టబు ..ఆంగ్ లీ తెరకెక్కించిన ఆస్కార్ విన్నింగ్ మూవీ `లైఫ్ ఆఫ్ పై` సహా పలు హాలీవుడ్
 
                                    
            Heroine|90 లో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అందాల ముద్దుగుమ్మ టబు. ఈ భామ అంటే యూత్ పడిచచ్చిపోయేవారు. ఈ టాలీవుడ్ బ్యూటీ వెండి తెరపై కనిపిస్తే చాలు కుర్రాళ్లు పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు. ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ అందంతో మంత్రముగ్ధులని చేస్తుంటుంది. తెలుగు, హిందీ భాషలలో నటించిన టబు ..ఆంగ్ లీ తెరకెక్కించిన ఆస్కార్ విన్నింగ్ మూవీ `లైఫ్ ఆఫ్ పై` సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి అలరించారు. తాజాగా అమెరికన్ టీవీ సిరీస్ – డూన్ ప్రోఫెస్సీలోను టబు నటించింది. అయితే ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, టబు తన నటనతో ఆకట్టుకుంది.

ఇక టబు న్యూయార్క్‌లో హెచ్‌బీఓ డూన్: ప్రొఫెసీ వరల్డ్ ప్రీమియర్‌కు టబు హాజరయ్యారు. భారతీయ డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా కస్టమ్-మేడ్ చేసిన బ్లాక్ కోచర్ గౌనులో టబు షో స్టాపర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఫ్యాషన్ డిజైనర్స్ కి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ డైట్ సబ్య ప్రపంచ ప్రీమియర్ నుండి టబు వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోకి `రెవరెండ్ మదర్ టబు` అని వ్యాఖ్యను జోడించింది. ఈ కస్టమ్ మేడ్ గౌను తయారు చేయడానికి ఒక నెల పట్టిందని టబు చెప్పుకురావడం విశేషం. అంతేకాకుండా అబు జానీ, సందీప్ ఖోస్లాను `భారతదేశంలో అత్యంత పాపులర్ డిజైనర్లు` అని అభివర్ణించారు. నేను వారిని ప్రేమిస్తున్నాను అని స్పష్టం చేశారు.
ప్రొఫెసీ లుక్‌ని డీకోడింగ్ చేస్తూ డిజైనర్లు రూపొందించగా, దీని ప్రత్యేకత ఏమిటీ అంటే.. ఒక క్లాసిక్ అంగ్రాఖాను తిరిగి రూపొందించే ఒక రకమైన కోచర్ పీస్ ఇది స్వచ్ఛమైన ఖాదీ సిల్క్‌తో తయారు చేసినది. 38 సంవత్సరాల క్రితం కనుగొన్న ఒక రహస్య ఆర్టిసానల్ సిగ్నేచర్ టెక్నిక్ ద్వారా సృష్టించిన ఆకృతి గల గౌను. ఆఫ్-షోల్డర్ ప్లంగింగ్ నెక్‌లైన్, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లు, బస్ట్ కింద సిన్చ్డ్ సిల్హౌట్.. ఫ్లోర్ స్కర్ట్‌తో పాటు ఫ్లోర్-లాంగ్ డిజైన్. ఇది చూడడానికి చాలా అందంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక టబు నటించిన ఈ సిరీస్ నవంబర్ 18 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు కనిపించనుంది.
View this post on Instagram
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram