Rahul Sipligunj | హ‌రిణి రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్‌..! సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్..!!

Rahul Sipligunj | ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, ప్ర‌ముఖ గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj ).. ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. హ‌రిణి రెడ్డి( Harini Reddy )తో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్( Rahul Sipligunj Engagement ) ఆదివారం కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగింది. రాహుల్, హ‌రిణి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియా( Social Media )లో వైర‌ల్ అవుతున్నాయి.

  • By: raj |    cinema |    Published on : Aug 18, 2025 11:50 AM IST
Rahul Sipligunj | హ‌రిణి రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్‌..! సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్..!!

Rahul Sipligunj | ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, ప్ర‌ముఖ గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj ).. ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. హ‌రిణి రెడ్డి( Harini Reddy )తో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్( Rahul Sipligunj Engagement ) ఆదివారం కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగింది. రాహుల్, హ‌రిణి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియా( Social Media )లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే రాహుల్ సిప్లిగంజ్ త‌న ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోల‌ను అధికారికంగా విడుద‌ల చేయ‌లేదు. త‌న ఎక్స్ ఖాతాలో చివ‌రిసారిగా ఆగ‌స్టు 15న సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోల‌ను పంచుకున్నాడు.

రాహుల్, హ‌రిణి ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను ఆయ‌న అభిమానులు, నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీని ధ‌రించ‌గా, హ‌రిణి నారింజ లెహంగాను ధ‌రించి.. చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించారు. ఈ జంట సూప‌ర్బ్ అంటూ అభిమానులు, నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక రాహుల్, హ‌రిణి పెళ్లి ఎప్పుడు ఉంటుంద‌ని నెటిజ‌న్లు ఆలోచిస్తున్నారు. అస‌లు ఈ షాకింగ్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పెళ్లిపై రాహుల్ అధికారిక ప్ర‌క‌ట‌న కోసం ఆయ‌న అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల చెక్కును అందించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోట‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ చెక్కును అందజేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. ఆషాడం బోనాల పండుగ సందర్భంగా ఈ కోటి రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున ఆ చెక్కును ఆయనకు అందించింది.