‘ప్రతినిధి 2’ హీరోయిన్ ‘సిరి లేళ్ల’తో నారా రోహిత్ ఎంగేజ్మెంట్
Nara Rohith | హీరో నారా రోహిత్(Nara Rohit) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లేళ్ల(Siree Lella)తో నారా రోహిత్ పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఆదివారం ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.

Nara Rohith | హీరో నారా రోహిత్(Nara Rohit) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లేళ్ల(Siree Lella)తో నారా రోహిత్ పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఆదివారం ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
ఆదివారం ఉదయం 10:45 గంటలకు లేళ్ల శిరీష(సిరి) వేలికి ఉంగరం(Engagement) తొడిగాడు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu naidu) దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు. శిరీష కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం కాబోయే వధూవరులకు, కుటుంబ సభ్యులకు అతిథులు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఎంగేజ్‌మెంట్‌కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారుడే నారా రోహిత్. ఈయన 2019లో ‘బాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన ‘సోలో’తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు నారా రోహిత్. ఆ తర్వాత ‘సారొచ్చారు’, ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి సినిమాల్లో నటించారు రోహిత్.
2018లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తర్వాత దాదాపు ఆరేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2(Pratinidhi 2)’ విడుదలై మంచి పేరు తెచ్చుకున్నా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితేనేం… రోహిత్‌కు జీవిత భాగస్వామిని మాత్రం ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిరితో రోహిత్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు ఇరు కుటుంబాల పెద్దలు ప్రకటించారు.