Susheela|లెజండ‌రీ సింగ‌ర్ పి.సుశీల‌కి అస్వ‌స్థ‌త‌…చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స‌

Susheela| ప్రముఖ గాయని, పద్మ భూషణ్ పీ సుశీల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 86 సంవత్సరాల లెజెండరీ సింగర్ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మై

  • By: sn    cinema    Aug 18, 2024 6:41 AM IST
Susheela|లెజండ‌రీ సింగ‌ర్ పి.సుశీల‌కి అస్వ‌స్థ‌త‌…చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స‌

Susheela| ప్రముఖ గాయని, పద్మ భూషణ్ పీ సుశీల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 86 సంవత్సరాల లెజెండరీ సింగర్ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు ఆల‌పించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. అయితే సుశీల‌కి శ‌నివారం తీవ్రమైన కడుపు నొప్పి రావ‌డంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య‌ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కావేరీ హస్పిటల్ వర్గాలు, నిపుణులైన వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నారు.అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఎలాంటి ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని వైద్యులు తెలియ‌జేశారు.

వివిధ భాషల్లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా పి. సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 2016లో మార్చిలో స్థానం సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో ఆమె పాటలు పాడారు. సుశీల 1950-1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగలో తనదైన ముద్ర వేసుకున్న సుశీల‌ని 2008లో భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్​లో ఐదు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు.