Varalaxmi sarathkumar|ఏంటి.. వరలక్ష్మీ పెళ్లికి ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేశారా.. నిజమెంత?
Varalaxmi sarathkumar| ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఎట్టకేలకి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ ని థాయ్‌లాండ్ వేదికగా జులై 2న పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. ఇక పెళ్లికి రాని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ వేడుకకు తమి
Varalaxmi sarathkumar| ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఎట్టకేలకి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ ని థాయ్‌లాండ్ వేదికగా జులై 2న పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. ఇక పెళ్లికి రాని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి, రిసెప్షన్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఖర్చుకి సంబంధించిన వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

వరలక్ష్మీ పెళ్లి కోసం రూ. 200 కోట్లకు పైగానే శరత్ కుమార్ ఖర్చు చేశారని నెట్టింట వైరల్ అవుతుండగా, దీనిపై వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. అంత డబ్బు ఎక్కడ ఉందో నాకు తెలియదు. కొందరు ఏమి తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెళ్లి కోసం అంత ఖర్చు ఎందుకు చేయడం, నా బిడ్డ పెళ్లి చాలా సింపుల్‌గా చేశాను. నిజాలు తెలుసుకోకుండా తప్పడు వార్తలు ప్రచారం చేయకండి అని శరత్ కుమార్ స్పష్టం చేశారు. ఇక రిసెప్షన్ తర్వాత నూతన జంట హనీమూన్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది.
హనీమూన్‌లో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. తుఫాను తర్వాత ప్రశాంతంగా ఉందని పేర్కొంది. ఫోటో చూసిన అభిమానులు అది ఏ దేశమో అని క్యూరియాసిటీ వ్యక్తం చేశారు. ఇక వరలక్ష్మీ భర్త విషయానికి వస్తే…ముంబైలోని అత్యంత సంపన్నుల్లో వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్ దేవ్ కూడా ఒకరు. అక్కడ ఆయనకు సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. నికోలాయ్ కు సుమారు రూ. 900 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. గతంలోనే ఆయనకి వివాహం జరిగింది.. 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి ని రెండో వివాహం చేసుకున్నారు సచ్ దేవ్. వివాహ వేడుక సందర్భంగా నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీరను బహుమతిగా ఇచ్చాడని ఓ టాక్ కూడా నడిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram