Varalakshmi Sarath Kumar| వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్ వేడుకలో మెరిసిన తారలు.. తెగ సందడి చేశారుగా..!
Varalakshmi Sarath Kumar| ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన నటనతో కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. మొదట్లో కథానాయికగా నటించిన ఈ భామ ఆ తర్వాత విలన్‌గా నటిస్తూ మెప్పిస్తుంది. అయితే ఈ భామ ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ తో కలిసి పెళ్లి పీటలెక్కింది. థాయ్ లాండ్ వేదికగా మంగళవారం (జులై 2) వీరి వివాహ వేడుక జరిగింది. వరలక్ష్మి మెహందీ వేడుక కూ
Varalakshmi Sarath Kumar| ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన నటనతో కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. మొదట్లో కథానాయికగా నటించిన ఈ భామ ఆ తర్వాత విలన్‌గా నటిస్తూ మెప్పిస్తుంది. అయితే ఈ భామ ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ తో కలిసి పెళ్లి పీటలెక్కింది. థాయ్ లాండ్ వేదికగా మంగళవారం (జులై 2) వీరి వివాహ వేడుక జరిగింది. వరలక్ష్మి మెహందీ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఇక రీసెంట్‌గా చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సీఎం స్టాలిన్ సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి హాజరయ్యారు.

నటుడు విజయ్ కుమార్, అతని కూతురు, నటి శ్రీదేవి,తమిళ, తెలుగు నటుడు సిద్ధార్థ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్,కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, నటి, మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి తదితరులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా వరలక్ష్మి, నికోలస్ సచ్ దేవ్ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ముంబైకు చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో చాలా రోజులుగా ప్రేమలో ఉండగా, వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చ జెండా ఊపడంతో ఈ ఏడాది మార్చిలో ఉంగరాలు మార్చుకున్నారు. థాయ్ లాండ్ పెళ్లిపీటలెక్కారు. కొద్ది రోజుల క్రితం తమ పెళ్లికి రావాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించింది వరలక్ష్మి. టాలీవుడ్ హీరోలను స్వయంగా కలసి తన పెళ్లి పత్రికలు కూడా అందజేసింది. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడం మనం చూశాం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram