జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలని ఫాలో అయ్యే వారికి వర్ష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన కామెడీతో పాటు తన అందచందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఈవెంట్లలోనూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇమ్మాన్యుయేల్, వర్ష కాంబో స్మాల్ స్క్రీన్‌పై చాలా హిట్ అయింది. సుధీర్, రష్మి జంట తర్వాత ఆ రేంజ్లో ఈ జంటనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన అనేక విషయాల గురించి ఎప్పటికప్పుడు నెటిజన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా చేదు ఘటన గురించి చెప్పుకొచ్చింది.
తాజాగా ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన AAA థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది.అక్కడ తన కారుని వాలెట్ పార్కింగ్‌కి ఇచ్చానని, సినిమా చూసి వచ్చాక కారు తీసుకునేందుకు బయట వేచి ఉన్నట్టు పేర్కొంది. అయితే కారు తీసుకొచ్చే సమయంలో ఓ వ్యక్తి తనపై తీవ్రంగా దుర్భాషలాడాడని పేర్కొంది. అతని ప్రవర్తన, మాటలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చాయి.ఆ వ్యక్తి ఫ్యామిలీ ముందే బూతులు మాట్లాడటం చేశాడు. అతని చేష్టలకు చాలా భయమేసిందని చెప్పింది. నా ప్లేస్‌లో వేరే అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటి, అలా దుర్భాషలాడితే అమ్మాయిలు ఎలా తీసుకుంటారని? పబ్లిక్ లో ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం వల్ల సొసైటీపై ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అంటూ వర్ష ప్రశ్నించింది.
వర్ష వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధని వ్యక్తం చేసింది. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని, అతని ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తానని చెప్పింది వర్షం. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పిన వర్ష.. దయచేసి ఇలాంటి వాటి వల్ల ఏదోక కుటుంబం బాగా బాధపడుతుందని పేర్కొంది. వర్ష వీడియోకి కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుండగా, మరి కొందరు ఎప్పటి మాదిరిగానే ట్రోల్ చేస్తున్నారు