సోషల్ మీడియాలో ఈ మధ్య హీరోల ఫ్యాన్స్ మాటల తూటాలు పేల్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇష్యూని పెద్దదిగా చేస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. హీరోలందరు కలిసి సంతోషంగా సరదాగా ఉంటుంటే, ఈ అభిమానులు కొట్టుకోవడం అనేది ఏమి బాగోలేదు. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. అల్లు అర్జున్, ప్రభాస్.. ఈ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు వారికి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న మొదటి హీరో ప్రభాస్ కాగా, బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలతో ఆయనకి దేశ విదేశాలలో సైతం మంచి గుర్తింపు దక్కింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
పుష్ప చిత్రం హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న పుష్ప2పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రభాస్ జస్ట్ లాటరీ స్టార్. రాజమౌళి కారణంగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు తప్ప ఆయన ప్రత్యేకత ఏమి లేదని బన్నీ ఫ్యాన్స్ ఆ మధ్య ట్రోల్ చేశారు. అదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్.. తన పీఆర్ టీమ్ తో కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. అల్లు అర్జున్ సర్జరీల హీరో. అంతా ఫేక్ ఇమేజ్ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇక తాజాగా మీ హీరో తాగుబోతు అంటే మీ హీరో తాగుబోతు అని సోషల్ మీడియాలో కొత్త వార్ నడుస్తుంది. బన్నీ గతంలో తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని చెప్పాడు. అంతేకాక ఆయన ఆల్కహాల్ తీసుకునే ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఇప్పుడు షేర్ చేస్తూ బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్.. ప్రభాస్ ఆల్కహాలిక్ పర్సన్. విపరీతమైన మందు అలవాటు ఉంది. అందుకే ప్రభాస్ ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. ఏది ఏమైన ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ పీక్స్ కి చేరుకుంటుంది. ఆ హీరోలిద్దరు మంచి అన్యోన్యంగా ఉంటుండగా, వీరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు.