కేసీఆర్ కరెంటు కట్ ఆరోపణలు అవాస్తం..టీఎస్‌స్పీడీసీఎల్ వివరణ
మహబూబ్‌నగర్ పర్యటనలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ ట్విటర్ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ ఎస్పీడీసీఎల్ ఖండిస్తూ
విధాత : మహబూబ్‌నగర్ పర్యటనలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ ట్విటర్ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ ఎస్పీడీసీఎల్ ఖండిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. శ్రీనివాస్ గౌడ్ ఇంటి పరిసరాల్లో కేసీఆర్ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలాంటి పవర్ కట్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని, కేసీఆర్ పర్యటనలో కరెంటు కోతలు జరిగినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. అయితే కేసీఆర్ తన ట్విటర్ ఖాతాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని, నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని పేర్కోన్నారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని, నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారని, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని, రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు. కేసీఆర్ ట్వీట్‌పై స్పందించిన టీఎస్‌స్పీడీసీఎల్ దానిపై విచారణ జరిపి కేసీఆర్ తెలిపిన సమాచరంలో వాస్తవం లేదని తేల్చింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ విద్వేష, విధ్వంస రాజకీయాలకు ఇది నిదర్శనమంటు మండిపడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram