Venu Swamy| పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన వేణు స్వామి
Venu Swamy| సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ నిత్యం వార్తలలో నిలిచే జ్యోతిష్కుడు వేణు స్వామి. సమంత, నాగచైతన్యల వివాహిక జీవితం అంత

Venu Swamy| సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ నిత్యం వార్తలలో నిలిచే జ్యోతిష్కుడు వేణు స్వామి. సమంత, నాగచైతన్యల వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే వేణు స్వామి చెప్పినట్టు సమంత, నాగ చైతన్య విడిపోవడంతో వేణు స్వామి పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగింది. ఇక మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి కూడా ముందే చెప్పి తెగ ఫేమస్ అయ్యారు. ఇక ఆయన దక్కించుకున్న పాపులారిటీతో హీరోయిన్స్, హీరోలు ఆయన చేత ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. వేణు స్వామితో పూజలు చేయిస్తే సక్సెస్ దక్కుతుందని భావిస్తారు.
హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామికి గొప్ప శిష్యురాలు. ప్రతి ఏడాది తప్పకుండా ఆయనతో పూజలు చేయిస్తుంది. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ కూడా ఆయనతో పూజలు చేయించుకున్న వారిలో ఉన్నారు. అయితే ఇటీవల వేణు స్వామి రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం మనం గమనిస్తూ ఉన్నాం. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ నాలుగో వివాహం చేసుకుంటారని వేణు స్వామి బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకి మరో వివాహం తప్పదు అని అంటున్నారు.
2024చివరలో పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకోనున్నాడని, జాతక ప్రకారం ఈ ఏడాది చివర్లో నాలుగో పెళ్లి చేసుకుంటాడని వేణు స్వామి అంచనా వేశాడు. జగన్ జాతకం ప్రకారం 2023 నుండి అష్టమాన శని ఉంది. కాబట్టి ఆయనకు మరోసారి సీఎం అయ్యే యోగం ఉందని అన్నారు. ఇక నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సీఎం అయ్యే అవకాశం లేదని కూడా చెప్పాడు వేణు స్వామి. వీరిద్దరి జాతకాలు బాగోలేదు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి 2024లో వీరిద్దరిలో ఎవరు కూడా సీఎం అయ్యే ఛాన్స్ లేదంటూ వేణు స్వామి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ‘పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే కోరిక నాకూ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి.. జగన్‌ను ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణే సీఎం కావాలి’ అంటూ వేణుస్వామి మాట్లాడిన వీడియో కూడా ఇటీవల తెగ హల్‌చల్ చేసింది.