Venu Swamy| మ‌రో బాంబ్ పేల్చిన వేణు స్వామి.. త్వ‌ర‌లోనే ఆ హీరోయిన్‌కి విడాకులు

Venu Swamy| ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్ర‌ముఖ స్టార్స్, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు

  • By: sn    cinema    Jul 21, 2024 11:00 AM IST
Venu Swamy| మ‌రో బాంబ్ పేల్చిన వేణు స్వామి.. త్వ‌ర‌లోనే ఆ హీరోయిన్‌కి విడాకులు

Venu Swamy| ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్ర‌ముఖ స్టార్స్, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇక ఇప్పుడు ఆయ‌న క్రేజ్ ఎలా ఉందంటే కొంద‌రు హీరోయిన్స్ ఆయ‌నతో ప్రత్యేక పూజ‌లు కూడా చేయించుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి ఫేమ‌స్ అయిన వేణు స్వామి .. రష్మిక మందన్న, డింపుల్ హయతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బుల్లితెర నటుల వరకు ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు.

అయితే ఇటీవ‌ల వేణు స్వామి జాత‌కాలు కాస్త బెడిసి కొట్టాయి. జ‌గ‌న్, కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్ట‌ద‌ని ఇలా త‌ప్పుడు జాత‌కాలు చెప్పి ట్రోలింగ్ బారిన ప‌డ్డాడు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వేణు స్వామి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. నేను చెప్పిన జాత‌కాల‌లో 90 శాతం సక్సెస్ అయ్యాయని, ఫెయిల్ అయిన 10 శాతం గురించి అంద‌రు చెబుతున్నారు త‌ప్ప 90 శాతం గురించి ఎవ‌రు మాట్లాడ‌డం లేద‌ని అన్నారు. ఇక హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ఆయ‌న మాట్లాడుతూ.. ఆమె వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసిరాదని, పలు సమస్యలు ఎదుర్కొంటుందని తానే ముందే చెప్పానని, తాను చెప్పినట్టుగానే ఆమె వైవాహిక జీవితం సాగుతోందని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లి అచ్చిరాదు అని అన్నాను. అలాగే నేను చెప్పినట్టే ఆమె భర్త నష్టపోయాడు. రకుల్ భర్త దాదాపు 500కోట్లు నష్టపోయాడు. నాకు తెలిసి మరో ఆరు నెలల్లో ఆమె విడాకులు తీసుకోవ‌డం ఖాయం. అది జరిగితే నా పై ట్రోల్ చేసిన వారిని చెప్పుతో కొట్టినట్టే అవుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.. అలాగే తన పై వచ్చే ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోను అని అన్నారు. మ‌రి వేణు స్వామి చెప్పిన‌ట్టు ర‌కుల్ పెళ్లి పెటాకులు అవుతుందా లేదా అనేది చూడాలి.