Divorces Celebrated| పీడ వదిలింది..భార్య విడాకులతో భర్త పాల స్నానం

విధాత : ఇటీవల కాలంలో భర్తలను వేధించే భార్యలు అధికమయ్యారు. కొందరైతే ఏకంగా పక్కా ప్లాన్ లు వేసి మరి లేపేస్తున్నారు. పాపం ఓ భర్త తన భార్యతో ఎంతగా వేధించబడ్డాడోగాని..తనతో విడాకులు మంజూరుకాగానే సంతోషం పట్టలేక 40లీటర్ల పాలతో స్నానం చేసి…దరిద్రం వదిలింది..శనీ పోయింది..పీడ విరగడైందంటూ సంబర పడ్డాడు. వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో మాణిక్ అలీ భార్య రెండుసార్లు తన ప్రియుడితో పారిపోయి తిరిగి వచ్చింది. అయినప్పటికి తన బిడ్డ కోసం కలిసి ఉండటానికి ఆమె చేసిన తప్పులను క్షమించాడు. అయితే భార్య ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించడంతో విసుగు చెంది విడాకులు తీసుకున్నాడు.
తాజాగా అధికారికంగా భార్యతో విడాకులు మంజూరు కావడంతో తనకు పునర్జన్మ లభించిందని 40 లీటర్ల పాలతో స్నానం చేసి తన ఆనందం వ్యక్తం చేశాడు. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకుల తర్వాత కొత్త జన్మ పొందినట్లు ఉందని, కొత్త జీవితానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని వివరించాడు. తన ప్రియుడితో రెండు సార్లు పారిపోయి మళ్లీ వచ్చినప్పటికి నా కూతురి కోసం ఆమెను క్షమించానని.. కలిసి ఉండటానికి ప్రయత్నించానని.. కానీ పదే పదే అదే తప్పు చేస్తుంటే భరించలేకపోయా’ అని మాణిక్ అలీ చెప్పాడు.