Vijay| విజయ్ దేవరకొండ సాయాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన ముందు కన్నీళ్లు పెట్టుకున్న ట్రాన్స్‌జెండర్..
Vijay| రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో సాయాలు చేశారు. కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో తన ది దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా దాదాపు 6 వేల కుటుంబాలకు

Vijay| రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో సాయాలు చేశారు. కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో తన ది దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా దాదాపు 6 వేల కుటుంబాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా కుటుంబాలు ఉపాధి లేక పూట గడవని పరిస్ధితులలో ఉండగా, వారికి తన వంతు సాయం అందించారు విజయ్ దేవరకొండ. ఆయన చేసిన సాయాన్ని ఇప్పటికీ చాలా మంది గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు.
అయితే తాజాగా విజయ్ ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అతిథిగా హాజరయ్యాడు. ఆ షోకి విజయ్ దేవరకొండ నుంచి సాయం పొందిన ట్రాన్స్ జెండర్స్ కూడా హాజరైంది. ఆ ట్రాన్స్ జెండర్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది.. ‘సర్ నేను ఒక ట్రాన్స్ జెండర్ ని.. రెండేళ్లుగా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నా. లాక్ డౌన్ సమయంలో మాకు ఫుడ్ కూడా దొరకలేదు. మేము బిక్షాటన చేసి జీవించాం. అయితే మీ ఫౌండేషన్ గురించి తెలిసినప్పుడు సాయం కోసం అప్లై చేయగానే వెంటనే మాకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత సాయం కూడా అందింది. నాతో పాటు 18 మంది ట్రాన్స్‌జెండర్స్ మీ ఫౌండేషన్ ద్వారా సాయం అందుకున్నాం అంటూ కన్నీటి పర్యంతం అయింది.
ఆ సాయం తర్వాత మేము దేవుడు ఎక్కడో లేడు, మీ రూపంలోనే మా ముందే ఉన్నాడని అనుకున్నాం అంటూ ఆ ట్రాన్స్ జెండర్ కన్నీటి పర్యంతం అయింది. అది ఆమె అంతగా ఎమోషనల్ అయ్యే సరికి విజయ్ దేవరకొండ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తన ఫౌండేషన్‌కి చాలా మంది సాయం చేశారు. వారి వల్లనే ఇదంతా సాధ్యమైందని విజయ్ అన్నారు. ఇక చివరిగా ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో ప్రేక్షకులని పలకరించాడు విజయ్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.