Vijayawada | రచ్చకెక్కిన.. మగ టీచర్ల ప్రేమాయణం
Vijayawada | విధాత: ఈ మధ్యకాలంలో లింగ భేదం తేడాలేకుండా ఒకే లింగం వారు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి కొన్ని ఘటనల్లో న్యాయస్థానాలు సైతం వారికి హక్కులు కల్పిస్తూ తీర్పులిచ్చాయి. ఇలాంటి ముచ్చటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పే ఇద్దరు మగ టీచర్లు ప్రేమలో పడ్డారు. పవన్, నాగేశ్వరరావు ఒకే పాఠశాలలో పని చేస్తున్నారు. కాగా.. ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే […]

Vijayawada | విధాత: ఈ మధ్యకాలంలో లింగ భేదం తేడాలేకుండా ఒకే లింగం వారు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి కొన్ని ఘటనల్లో న్యాయస్థానాలు సైతం వారికి హక్కులు కల్పిస్తూ తీర్పులిచ్చాయి.
ఇలాంటి ముచ్చటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పే ఇద్దరు మగ టీచర్లు ప్రేమలో పడ్డారు. పవన్, నాగేశ్వరరావు ఒకే పాఠశాలలో పని చేస్తున్నారు. కాగా.. ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు.
ఈ క్రమంలోనే నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని, ట్రాన్స్ జెండర్‌గా మారాడు. అనంతరం భ్రమరాంబగా పేరు మార్చుకున్నాడు.
ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు పట్టించుకోవడం మానేశాడు. దీంతో నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ భ్రమరాంబ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.