Bigg Boss8| ఎట్టకేలకి విష్ణు ప్రియ కోరిక తీరింది.. మెగా చీఫ్‌గా స్టార్ యాంకర్
Bigg Boss8| వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకముందు బిగ్ బాస్(Bigg Boss) హౌజ్‌లో పాపులర్ పర్సన్ ఎవరు అంటే విష్ణు ప్రియనే. అందరికి ఆమె ఒక్కతే బాగా తెలుసు. ఈ సారి టైటిల్ కొట్టేది కూడా విష్ణు ప్రియనే అని అందరు అనుకున్నారు. కాని పరిస్థితులు మారాయి. విష్ణు ఆటలోను తేడా వచ్చింది. దాంతో ఆమెకి ఓటిం

Bigg Boss8| వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకముందు బిగ్ బాస్(Bigg Boss) హౌజ్‌లో పాపులర్ పర్సన్ ఎవరు అంటే విష్ణు ప్రియనే. అందరికి ఆమె ఒక్కతే బాగా తెలుసు. ఈ సారి టైటిల్ కొట్టేది కూడా విష్ణు ప్రియనే అని అందరు అనుకున్నారు. కాని పరిస్థితులు మారాయి. విష్ణు ఆటలోను తేడా వచ్చింది. దాంతో ఆమెకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ వచ్చింది. అయితే మెగా చీఫ్ కావాలని ఎన్నో కలలు కన్న విష్ణు ప్రియకి ఆ కోరిక తీరింది. తాజా ఎపిసోడ్ లో యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) మెగా చీఫ్ అయిపోయింది. మెగా చీఫ్ కంటెండర్ కోసం బీబీ రాజ్యం అనే థీమ్‌తో అనేక ఛాలెంజ్‌లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లో ఎక్కువగా ఓజీ క్లాన్ గెలిచింది. దాంతో ఓజీ నుంచి నలుగురు మెగా చీఫ్ కంటెండర్స్‌గా నిలిచారు.
రాయల్ క్లాన్ ఓడిపోయిన ప్రతిసారి ఒక్కొక్కరిని కంటెండర్ టాస్క్ నుంచి తీసేస్తూ వచ్చారు. రాయల్ క్లాన్ రెండు టాస్క్‌లు గెలవడంతో వారి నుంచి రోహిణి, టేస్టీ తేజ ఇద్దరిని మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎన్నుకున్నారు. పలు సూచనల ప్రకారం ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వచ్చారు. చివరిగా నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. చివరగా కత్తి అందుకున్న గౌతమ్.. యాంకర్ విష్ణుప్రియను మొదటి లేడి మెగా చీఫ్‌గా చూడాలని, అందరికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుందని కోరుతూ నిఖిల్‌ను అవుట్ చేశాడు. దాంతో ఏ మాత్రం కష్టపడకుండా యాంకర్ విష్ణుప్రియ తొమ్మిదో వారానికి మెగా చీఫ్(Mega Chief) అయింది.
బిగ్ బాస్ తెలుగు 8లో మొదటి మహిళా మెగా చీఫ్‌గా విష్ణుప్రియ నిలిచింది. ఈసారి టాస్క్ లలో సత్తా చాటిన నిఖిల్, పృధ్వీ తో పాటు రాయల్ క్లాన్ నుంచి తేజ, రోహిణి లాంటి వారికి కూడా దక్కని అదృష్టం విష్ణు ప్రియను వరించింది. ఇప్పుడు విష్ణు ప్రియ నామినేషన్స్ లో ఉంది. ఈవారం తక్కువ ఓటింగ్ కూడా ఆమెకే పడిందని సమాచరం. ఇక మెగా చీఫ్ అవ్వగానే ఆమె ఎలిమినేట్(Eliminate) అయితే పరిస్థితి ఏంటి..? ఇక 2 లక్షల ప్రైజ్ మణీ కూడా ఆర్డర్ చేశారు బిగ్ బాస్. అటు విష్ణు ప్రియ మాత్రం పృధ్వీని వదిలిపెట్టడంలేదు. ప్రేమను చంపుకోలేక వెంటపడి ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తోంది. ఇక మెగా చీఫ్ అయ్యింది కాబట్టి ఇప్పుడైనా మంచి గేమ్ చూపిస్తే.. ఆ వారం ఎలిమినేషన్ నుంచి బయటు పడటంతో పాటు.. ఆమె నెక్ట్స వీక్ నామినేషన్స్ నుంచి బయటపడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.