Nayanthara | నయనతార – ప్రభుదేవా బ్రేకప్‌.. ఇన్ని రోజులకు బయటపడ్డ కారణం..! ఇంతకీ ఏం జరిగిందంటే..?

Nayanthara | నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీరంగ ప్రవేశం చేసిన తక్కువ సమయంలోనే తనదైన నటనతో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపదించుకొని.. సౌత్‌ లేడి సూపర్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది.

Nayanthara | నయనతార – ప్రభుదేవా బ్రేకప్‌.. ఇన్ని రోజులకు బయటపడ్డ కారణం..! ఇంతకీ ఏం జరిగిందంటే..?

Nayanthara | నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీరంగ ప్రవేశం చేసిన తక్కువ సమయంలోనే తనదైన నటనతో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపదించుకొని.. సౌత్‌ లేడి సూపర్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్లలో నయనతార సైతం ఒకరు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నది. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు సైతం ఉన్నారు. అయితే, విగ్నేష్‌ శివన్‌తో పెళ్లికి ముందు నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడింది.

మనస్పర్థల కారణంగా బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే, నయనతార, ప్రభుదేవా బ్రేకప్‌కు కారణాలు అప్పట్లో తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. నయన్‌ కోసం ప్రభుదేవా తన భార్యకు సైతం విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రేమలో ఉన్న సమయంలో నయన్‌కు చాలా కండీషన్స్‌ పెట్టేవాడని.. అందుకే బ్రేకప్‌ అయినట్లు సమాచారం. నయనతార ఓ క్రిస్టియల్‌ కావడంతో పెళ్లి తర్వాత ఆమె మతం మార్చుకోవాలని.. సినిమాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని.. పెళ్లి తర్వవాత మొదటి భార్య పిల్లలు సైతం తమతో పాటు ఉంటారనే కండిషన్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. కండీషన్స్‌ చాలా వరకు ఒప్పుకున్నా.. మొదటి భార్య పిల్లలతో కలిసి ఉండేందుకు నిరాకరించిందని తెలుస్తున్నది. అదే దానికి కారణమని బ్రేకప్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ‘విల్లు’ మూవీ షూటింగ్‌ సమయంలో నయన్‌ – ప్రభుదేవా లవ్‌లో పడ్డారని టాక్‌. 2010లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మళ్లీ 2012లో ఇద్దరూ విడిపోయారు. అయితే, సిరియన్‌ క్రిస్టియన్‌ అయిన నయన్‌ పెళ్లి కోసం 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. అయితే, అంతకు ముందు వల్లవన్‌ చిత్రంలో నటించిన సమయంలో శింబుతో ప్రేమలో ఉందని.. ఆ తర్వాత కొద్దిరోజులకే విడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. చివరిసారిగా బాలీవుడ్‌లో జవాన్‌ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నది. గూడ్‌ బ్యాడ్‌ అగ్లీ, టాక్సిక్‌, మూక్కూటి అమ్మన్‌-2, మహారాణి తదితర చిత్రాల్లో నటిస్తున్నది.