Sai Pallavi|ఇత‌ర హీరోయిన్స్ క‌న్నా సాయి ప‌ల్లవినే చాలా స్పెష‌ల్.. ఎందుకో తెలుసా?

Sai Pallavi| మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చక్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం, నెమ‌లి మాదిరిగా నాట్యం చేయ‌డం సాయి ప‌ల్ల‌వికే చెల్లింది. ప్రస్తుతం సౌత్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ల జాబితా ప‌రిశీలిస్తే అందులో సాయి ప‌ల్ల‌వి త‌ప్ప‌క ఉంటుంది.ఆమె చేసినవి కొన్నే సినిమాలు అయిన ప్ర‌తి చిత్రంలోను వైవిధ్యం చూపిస్తూ అభిమానుల మ‌న‌స్సు కొల్ల‌గొడుతుంటుంది. సాయి ప‌ల్ల‌వి క‌థ న‌చ్చ‌క‌పోతే

  • By: sn    cinema    Aug 09, 2024 7:55 PM IST
Sai Pallavi|ఇత‌ర హీరోయిన్స్ క‌న్నా సాయి ప‌ల్లవినే చాలా స్పెష‌ల్.. ఎందుకో తెలుసా?

Sai Pallavi| మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చక్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం, నెమ‌లి మాదిరిగా నాట్యం చేయ‌డం సాయి ప‌ల్ల‌వికే చెల్లింది. ప్రస్తుతం సౌత్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ల జాబితా ప‌రిశీలిస్తే అందులో సాయి ప‌ల్ల‌వి త‌ప్ప‌క ఉంటుంది.ఆమె చేసినవి కొన్నే సినిమాలు అయిన ప్ర‌తి చిత్రంలోను వైవిధ్యం చూపిస్తూ అభిమానుల మ‌న‌స్సు కొల్ల‌గొడుతుంటుంది. సాయి ప‌ల్ల‌వి క‌థ న‌చ్చ‌క‌పోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన వెంట‌నే రిజెక్ట్ చేస్తుంది. మ‌ల‌యాళ భామ అయిన కూడా సాయి ప‌ల్ల‌వి తెలుగుపై ప‌ట్టు సాధించి త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక పారితోషికం విష‌యంలో నిర్మాత‌ల‌ని భ‌య‌పెట్టించేలా చేయ‌దు. వారికి అనుకూలంగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

సాధార‌ణంగా ఇప్పటి హీరోయిన్స్ రెండు మూడు హిట్స్ ప‌డితే చాలు వెంట‌నే రెమ్యున‌రేష‌న్ పెంచేస్తారు. సాయి ప‌ల్ల‌వి అలా కాదు ఎన్ని బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టినా సరే పారితోషకం విషయంలో ఏమాత్రం కూడా డిమాండ్ చేయదు. సాయి పల్లవి వృతిరీత్యా డాక్టర్. ఒకవైపు తన కోరికను సినిమాల ద్వారా తీర్చుకుంటూనే , మరొకవైపు పేద ప్రజలకు వైద్యురాలిగా కూడా త‌న‌వంతు సాయం అందిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగచైతన్యకు జోడిగా తండేల్ సినిమాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ సరసన రామాయణంలో సీతగా నటిస్తోంది. ఈ రెండు సినిమాల‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇక సాయి ప‌ల్ల‌వి గొప్ప‌త‌నం గురించి పడి పడి లేచే మనసు సినిమా నిర్మాత ఓ సంద‌ర్భంలో గొప్ప‌గా చెప్పుకొచ్చారు.ఈ సినిమా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా,ఈ చిత్రం క‌థ బాగున్నా కూడా ఎందుకో అభిమానుల‌కి పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. భారీ బ‌డ్జెట్‌తో మూవీ రూపొందిన ఈ సినిమా నిర్మాత‌ల‌కి న‌ష్టాల‌నే మిగిల్చింది. అయితే అలాంటి స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి త‌న పారితోషికంలో కొంత మాత్రమే తీసుకొని మిగతాదంతా వదిలేసిందట. ముందుగానే రెమ్యున‌రేష‌న్ తీసుకున్నా కూడా నిర్మాత‌ల‌కి న‌ష్టం వ‌చ్చింద‌ని తెలిసి తిరిగి కొంత రెమ్యున‌రేష‌న్ సాయి ప‌ల్ల‌వి రిట‌ర్స్ చేసింద‌ట‌. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇలా చాలా సార్లు చేశారు. ప్ర‌స్తుతం సాయి పల్ల‌వి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాట‌లో ప‌య‌నిస్తుండ‌గా, ఆమెని అభిమానులు ముద్దుగా లేడి ప‌వర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు