సినీ నటి హేమ, పెడ్లర్ షరీఫ్‌ల అరెస్టు .. బురఖాలో సీసీబీ పోలీసుల విచారణకు హేమ

సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు

  • Publish Date - June 3, 2024 / 07:17 PM IST

విధాత : సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరుకాలేదు. మూడోసారి నోటీసుతో సోమవారం విచారణకు హాజరయ్యారు. మీడియా కంటపడకుండా బురఖాలో ఆమె విచారణకు హాజరుకావడం విశేషం. ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నటి హేమతో పాటు డ్రగ్ పెడ్లర్ ఇమ్రాన్‌ షరీఫ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు రేవ్ పార్టీకి పెద్ద ఎత్తున షరీఫ్‌ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ పార్టీలో 86మందికి డ్రగ్‌ పాజిటీవ్‌గా తేలింది. అందులో 59మంది పురుషులు, 27మంది మహిళలున్నారు.

 

 

Latest News