వంద‌ల‌కోట్ల హెరాయిన్ ప‌ట్టివేత

విధాత,ముంబై :ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్‌పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్‌ చేశారు. పట్టుకున్న డ్రగ్స్‌ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు 300 కిలోల […]

వంద‌ల‌కోట్ల హెరాయిన్ ప‌ట్టివేత

విధాత,ముంబై :ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్‌పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్‌ చేశారు. పట్టుకున్న డ్రగ్స్‌ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. అలాగే ఐదు ఏకే-47 రైఫిల్స్‌, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది.