పోలీసులే కిడ్నాపర్లు
విధాత : ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసి అతడి ఆస్తులు రాయించుకున్న కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు సహా పది మంది పోలీసులపై ఆదివారం సీబీసీఐడీ ఆరు సెక్షన్లతో కేసు నమో దు చేసింది. చెన్నై అయపాక్కంకు చెందిన పారి శ్రామికవేత్త రాజేష్ ఆరు నెలల క్రితం కిడ్నాప్ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనతో బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకుని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో పోలీసు అధికారులు ఉన్నట్టు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో […]

విధాత : ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసి అతడి ఆస్తులు రాయించుకున్న కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు సహా పది మంది పోలీసులపై ఆదివారం సీబీసీఐడీ ఆరు సెక్షన్లతో కేసు నమో దు చేసింది. చెన్నై అయపాక్కంకు చెందిన పారి శ్రామికవేత్త రాజేష్ ఆరు నెలల క్రితం కిడ్నాప్ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనతో బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకుని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో పోలీసు అధికారులు ఉన్నట్టు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు సీబీసీఐడీకి చేరింది. ఆరు నెలలుగా ఈ కేసును సీబీసీఐడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులే కిడ్నాపర్లని తేలింది. తిరుమంగళం ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు సహా పది మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి విచారించేందుకు సీబీసీఐడీ సిద్ధమవుతోంది.