రాడిసన్ డ్రగ్ కేసు విచారణకు లిషి, సందీప్‌ల హాజరు
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న నిందితులు నటి లిషి, సందీప్‌లు గచ్చిబౌలి పోలీసుల ఎదుటు విచారణకు హాజరయ్యారు

- బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న డైరక్టర్ క్రిష్
విధాత, హైదరాబాద్ : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న నిందితులు నటి లిషి, సందీప్‌లు గచ్చిబౌలి పోలీసుల ఎదుటు విచారణకు హాజరయ్యారు. సందీప్, లిషిల వాంగ్మూలం స్వీకరించి వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. అమెరికాకు పారిపోయిన నీల్, కేదార్ పై కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పోలీసుల ముందు హాజరైన కేదార్ బెయిల్ పై బయటకు వచ్చాక విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన డైరక్టర్ క్రిష్ సోమవారం తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.