అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుటుంబంలో విషాదం రేపింది. తాండూరు డిపోలో పనిచేస్తున్న రాజప్ప మంగళవారం యాలాల మండలం దౌలాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

  • By: Subbu |    crime |    Published on : Apr 30, 2024 5:25 PM IST
అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుటుంబంలో విషాదం రేపింది. తాండూరు డిపోలో పనిచేస్తున్న రాజప్ప మంగళవారం యాలాల మండలం దౌలాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో లభించిన లేఖలో అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాజప్ప తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.