Murder | తమిళనాడులో ఘోరం.. బీఎస్పీ చీఫ్ దారుణ హత్య..!
Murder | తమిళనాడులో ఘోరం జరిగింది. బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చెన్నై పెరంబూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడిచేసి చంపారు. ఈ దాడిలో ఆర్మ్ స్ట్రాంగ్ వెంట ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Murder : తమిళనాడులో ఘోరం జరిగింది. బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చెన్నై పెరంబూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడిచేసి చంపారు. ఈ దాడిలో ఆర్మ్ స్ట్రాంగ్ వెంట ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దాడి ఆర్మ్ స్ట్రాంగ్ ఇంటికి సమీపంలోనే చోటుచేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లో వచ్చిన దుండగులు.. పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. ఈ కేసులో శనివారం ఉదయం 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణం రాజకీయ వైరమా.. వ్యక్తిగత కక్షలా..? అన్నది తేలాల్సి ఉంటుంది.