Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్
బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ సోదాలు, 8 మంది అరెస్టులు. టాలీవుడ్ సెలబ్రిటీలకు విచారణ నోటీసులు, జీఎస్టీ శాఖ 357 సైట్లను బ్లాక్ చేసింది.

విధాత, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ సోదాలు, అరెస్టులతో ముందుకెలుతుంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజ్ 007, ఫెయిర్‌ప్లే లైవ్, ఆంధ్ర 365, వీఎల్ బుక్, తెలుగు 365, యస్ 365 బెట్టింగ్ యాప్‌లను ఈ ముఠా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు భారీగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడి రూ.వేల కోట్లను దేశం దాటించారని..యాప్స్‌ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యూనరేషన్ చెల్లించారనే ఆరోపణలతో పలు కేసులు నమోదయ్యాయి. 25 మందిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన తర్వతా దర్యాప్తు ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ నోటీసులు అందుకున్న వారిలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు. వారిలో చాలమంది ఇప్పటికే విచారణకు హాజరయ్యారు.
ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ఓవైపు నిషేధ కొరఢా ఝళిపించింది. ఆన్ లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న 357 వెబ్ సైట్లు, యూఆర్ఎల్ లను బ్లాక్ చేసింది. సుమారు 700 ఆఫ్ షోర్ సంస్థలపైనా ప్రస్తుతం డీజీజీఐ నిఘా పెట్టింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి 140కోట్ల మేరకు సీజ్ చేసింది. కోట్లను ఫ్రీజ్ చేసింది.