విధాత : అవినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 45వేలు లంచం తీసుకుంటూ ఇండస్ట్రియల్ ఏడీ వెంకట నర్సిరెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. పరిశ్రమ అనుమతి కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అటు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఏజెంట్ నుంచి రూ.99,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రర్‌తో పాటు ఏజెంట్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన మరో ఇద్దరు అధికారులు మేడ్చల్‌లో ఇండిస్ట్రియల్ అధికారి ..సూర్యాపేటలో రిజిస్ట్రార్
వినీతి అధికారుల భరత పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూసుకుపోతుంది. సోమవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు