పొర‌పాటున కూడా ఈ ఏడు వ‌స్తువులు ఎవ‌రికీ ఇవ్వొద్దు.. తీసుకోవ‌ద్దు..!

కామ‌న్‌గా షేర్ చేసుకునే వ‌స్తువుల విష‌యంలో వాస్తు నియ‌మాలు పాటించాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాద‌ని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

పొర‌పాటున కూడా ఈ ఏడు వ‌స్తువులు ఎవ‌రికీ ఇవ్వొద్దు.. తీసుకోవ‌ద్దు..!

స్నేహితుల మ‌ధ్య ఇచ్చిపుచ్చుకోవ‌డ‌లు స‌హ‌జం. చాలా వ‌స్తువులను ఫ్రెండ్స్ మార్పిడి చేసుకుంటుంటారు. దీంతో ఆ స్నేహితుల మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. ఇద్ద‌రం ఒక్క‌టే అన్న‌తీరుగా ఉంటుంటారు. అయితే కామ‌న్‌గా కొన్ని వ‌స్తువులు షేర్ చేసుకోవ‌డం చూస్తూనే ఉంటాం. అలా కామ‌న్‌గా షేర్ చేసుకునే వ‌స్తువుల విష‌యంలో వాస్తు నియ‌మాలు పాటించాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాద‌ని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం.

1. పెన్ను

చాలా మంది అవ‌స‌రానికి పెన్నును ఇత‌రుల నుంచి తీసుకుంటారు. ఆ ప‌ని పూర్త‌యిన త‌ర్వాత కూడా పెన్నును తిరిగి ఇవ్వ‌రు. ఇలా పెన్ను తిరిగి ఇవ్వ‌కుండా ఉండ‌టం అనేది మంచిదికాదు. పెన్ ఇవ్వ‌డం కానీ, తీసుకున్న పెన్ మీ ద‌గ్గ‌రే ఉంచుకోవ‌డం మంచిది కాద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెన్నును ఇత‌రుల నుంచి తీసుకొని తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న ఆర్థిక ప‌రిస్థితిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

2. మొక్క

చాలా మంది త‌మ ఇండ్ల‌లో మొక్క‌ల‌ను పెంచుకుంటుంటారు. ఇక ఎవ‌రైనా ఇంటికి వ‌స్తే ఆ మొక్కల‌పై వారి దృష్టి ప‌డుతుంది. దాంతో ఆ మొక్క‌ను ఇవ్వండంటూ అడుగుతారు. కానీ ఆ మొక్క‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు అయితే మీ ఇంట్లోని శ‌క్తిని ఇతరుల‌కు ఇచ్చిన‌ట్లు అవుతుంది. మొక్క‌లు అదృష్టాన్ని ప్ర‌సాదిస్తాయి. కాబ‌ట్టి మొక్క‌ల‌ను ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌దు.

3. పాదరక్షలు

వాస్తు నియమాల ప్ర‌కారం.. చెప్పుల‌ను, బూట్ల‌ను ఇత‌రుల‌కు ఇవ్వొద్దు. ఇత‌రుల చెప్పులు, బూట్లు కూడా వేసుకోకూడ‌దు. శని దేవుడు బూట్లు, చెప్పులతో ఉంటాడని నమ్ముతుంటారు. ఒకరికొకరు చెప్పులు, బూట్లు ధరించడం వల్ల ఆ శని దోషాన్ని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఇది మీ జీవితంలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. మీ పాదరక్షలను ఇతరులతో పంచుకోవడం పేదరికం, ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది.

4. ఆభరణాలు

ఆభరణాలు, రత్నాలు సానుకూల శక్తిని ప్రసాదించడంలో కీల‌కపాత్ర పోషిస్తాయ‌ని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వీటిని ధ‌రించ‌డం అదృష్టంగా భావిస్తారు. ఆభ‌ర‌ణాలు, ర‌త్నాల‌ను సంప‌ద‌కు చిహ్నంగా కూడా భావిస్తారు. ఇలాంటి ఆభరణాలు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చినట్లయితే మీ సంపద వారికి ఇచ్చినట్లవుతుంది.

5. పెర్ఫ్యూమ్

పెర్య్పూమ్ ఎవరికీ బహుమతిగా, ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. పెర్ప్యూమ్ మీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు వ్యక్తపరుస్తుంది. ఇలాంటివి పంచుకోవడం వల్ల మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్లు అవుతుంది. .

6. లక్కీ చార్మ్ బ్రాస్‌లెట్

మీ అదృష్టాన్ని బ్రాస్ లెట్ సూచిస్తుంది. మీరు మీ బ్రాస్‌లెట్‌ను ఇతరులకు షేర్ చేస్తే.. మీ అదృష్టాన్నిఇతురులతో పంచుకున్నట్లే.

7. దిండు

మీరు శ‌క్తివంతంగా ఉండాలంటే.. రాత్రిళ్లు సుఖంగా నిద్ర పోవ‌డం చాలా ఇంపార్టెంట్. మ‌రి సుఖంగా నిద్రించాలంటే దిండు చాలా ముఖ్యమైంది. అలాంటి దిండును మరొకరు ఉపయోగించుకోవడం వల్ల మీ అదృష్టం ఇతరులకు పంచినట్లు అవుతుంది.