Bandi Sanjay | మాకొక శ్రీవారి ఆలయం కట్టించండి: TTD చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

  • By: sr |    devotional |    Published on : Apr 05, 2025 2:26 PM IST
Bandi Sanjay | మాకొక శ్రీవారి ఆలయం కట్టించండి: TTD చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

విధాత: కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు లేఖ రాశారు.

గతంలో 2023 సంవత్సరంలో మే 31న కరీంనగర్ లోని పద్మానగర్ ప్రాంతంలో 10ఎకరాలలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు, కరీంనగర్ ప్రజల సమక్షంలో భూమిపూజ నిర్వహించారని లేఖలో గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కరీంనగర్ పట్టణ వాసులే కాకుంగా యావత్తు శ్రీవారి భక్తులు ఎంతో ఆశగా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారని బండి సంజయ్ తెలిపారు.

ప్రస్తుతం చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించడం సంతోష దాయకమన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో పద్మావతి నగర్ లో కూడా మీ హయాంలో అధ్బుత శ్రీవారి ఆలయాన్ని త్వరితగతిన నిర్మించి ప్రారంభించి కరీంనగర్ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను అందించాలని కరీంనగర్ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.