Chaturgrahi Yoga | సింహరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..!
Chaturgrahi Yoga | చతుర్గ్రాహి యోగం( Chaturgrahi Yoga ) అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట రాశిలో నాలుగు గ్రహాల కలయిక ఒకేసారి జరగడం. ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశులవారికి( Zodiac Signs ) ) ఆర్థికంగా, సామాజికంగా అదృష్టం, సంపద, విజయం వంటి లాభాలు కలుగుతాయి.

Chaturgrahi Yoga | వేద పంచాంగం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి( Zodiac Signs ) ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా రాశులు ప్రవేశించిన ప్రతి సారి ప్రత్యేక యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సెప్టెంబర్( September ) మాసంలో అలాంటి ఓ ప్రత్యేక యోగం ఏర్పడనుంది. అదేంటంటే.. సింహ రాశి( Leo )లో చతుర్గ్రాహి యోగం( Chaturgrahi Yoga )ఏర్పడనుంది. అంటే బుధుడు, శుక్రుడు, కేతువు, సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ యోగం ఏర్పడుతుంది. తద్వారా ఓ మూడు రాశుల వారికి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో లాభం జరగనుంది. మరి ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఊహించని విధంగా డబ్బు సమకూరుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం..
సింహ రాశి ( Leo )
సింహ రాశి మొదటి ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎంతో శుభప్రదం. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రతి పని కూడా విజయ తీరాలకు చేరుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో.. వైవాహిక జీవితం ఆనందమయంగా కొనసాగుతుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కొత్త భాగస్వాములను చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశి( Scorpio )
వృశ్చిక రాశి వారికి చతుర్గ్రాహి యోగం ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. వీరు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు పని చేసే ప్రదేశంలో సృజనాత్మకత, నాయకత్వ నైపుణ్యానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశివారికి తమ తండ్రితో బంధం మరింత బలపడుతుంది.
ధనుస్సు రాశి ( Sagittarius )
చతుర్గ్రాహి యోగం కారణంగా ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పని చేసే ప్రదేశంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశం ఉంది. ఈ సమయంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది.