06.07.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

06.07.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏకాగ్రత, పట్టుదలతో ఉంటే మంచిది. సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహనం, సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగస్థులు నూతన బాధ్యతలను చేపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యహారాలు ఎటూ తేలక గందరగోళంగా ఉంటారు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్థులు గొప్ప శుభవార్తలు వింటారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా అంతటా విజయమే. ఆదాయం వృద్ది చెందుతుంది. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలతో సంతోషంగా ఉంటారు. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది. పదింతలు లాభాలను పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఆర్ధికంగా కలిసి వస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రమాదాలు, అసూయా పరుల నుంచి సురక్షితంగా ఉండాలి. ఆర్ధికంగా నష్టాలు ఉండవచ్చు. ఉద్యోగస్థులకు పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కోపాన్ని నియంత్రించుకోండి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయం, సంపద వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టివారు మీ సహాయం కోరి వస్తారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడిచిపోతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విదేశాల నుంచి అందిన ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున కొత్తగా ఏ పనులు చేపట్టవద్దు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టడం, ఇతరులకు హామీ ఉండడం వంటివి చేయవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. వరుస అపజయాలతో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది.