ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జలగండం.. జర జాగ్రత్త..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రాదు. తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు, సమయం వృధా కావచ్చు. కీలమైన విషయాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అనవసరంగా ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల నష్టాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు గడ్డు కాలం నడుస్తోంది. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురు కావడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఇటు అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇతరులకు సాయం చేయబోయి చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురు కావడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఈ రోజు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారంలో ఊహించని నష్టాలు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగరంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఫలితాలు ఆలస్యమయినా నిరాశకు లోనుకావద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకునే స్థిరమైన నిర్ణయాలు ఆర్థిక లాభాలను అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెబితే మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మీనం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఎటు చూసినా శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. జలగండం ఉంది. అందుకే జలాశయాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.