Bed Room | పడక గదిలో ఈ తప్పులు చేస్తున్నారా..? జర జాగ్రత్త..!
Bed Room | ప్రతి కుటుంబానికి పడక గది( Bed Room ) చాలా ముఖ్యం. ఎందుకంటే.. పడక గదిని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే.. ఆ కుటుంబం( Family ) సంతోషంగా ఉన్నట్టే.

Bed Room | ప్రతి కుటుంబానికి పడక గది( Bed Room ) చాలా ముఖ్యం. ఎందుకంటే.. పడక గదిని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే.. ఆ కుటుంబం( Family ) సంతోషంగా ఉన్నట్టే. ఇంటి సమస్యలతో పాటు దాంపత్య జీవితానికి( Couple Life ) సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ పడక గదిలోనే చర్చించుకుంటాం.. కాబట్టి బెడ్రూంను వీలైనంత వరకు మంచిగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఆ ఇంటి దంపతుల మధ్య కలహాలు( Fight ) దూరం కావడంతో పాటు లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
పడక గది విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం సరిగ్గా ఇంటికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి.
- అదేవిధంగా బాత్రూంకు ఎదురుగా మంచం ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ నియమం తప్పకుండా పాటించాలి.
- పడకగదిలో చాలా మంది మంచాన్ని ఏదో ఒక గోడకు అనించి ఉంచుతుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలా ఉంచడం పెద్ద పొరపాటు అట. కాబట్టి, ఎప్పుడూ మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
- మంచానికి ఉండే ర్యాక్స్‌లో అనవసరమైన వస్తువులను ఉంచకూడదట. దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి.. అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందట.
- కొందరు మంచం కింద పాత సూట్కేసులు, పాత సామానులు వంటి కొన్ని పనికిరాని వస్తువులు పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులను కాట్ కింద ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని సూచిస్తున్నారు.
- ఉదయం నిద్రలేవగానే ఎదురుగా గడియారం, క్యాలెండర్ వంటివి కనిపించేలా కాకుండా, కొద్దిగా పక్కకు ఏర్పాటు చేసుకోవాలి. దేవుళ్ల క్యాలెండర్లైతే పర్వాలేదు! కానీ, గడియారం ఎట్టిపరిస్థితుల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.