Kedarnath Dham | చార్‌ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్..! 10న తెరచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు..
Kedarnath Dham | ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మరో రెండురోజుల్లో తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను తెరిచేందుకు ముందస్తుగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులను బాబా కేదార్‌నాథ్ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
Kedarnath Dham | ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మరో రెండురోజుల్లో తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను తెరిచేందుకు ముందస్తుగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులను బాబా కేదార్‌నాథ్ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. కేదార్‌నాథ్, మధ్మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్ ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచముఖి డోలి యాత్ర, బాబా కేదార్‌నాథ్ పంచముఖి భోగమూర్తిని రోడ్డు మార్గం ద్వారా 9న సాయంత్రం కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకునేందుకు ఉఖిమఠ్ నుంచి బయలుదేరనున్నది.
ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి యాత్ర గుప్తకాశీలోని విశ్వనాథ్ ఆలయానికి చేరుతుంది. యాత్ర గుప్తకాశీ నుండి రెండవ స్టాప్ ఫటాకు మంగళవారం బయలుదేరగా.. ఫటా నుంచి బుధవారం మూడోస్టాప్ అయిన గౌరీకుండ్‌కు చేరుకోన్నది. 9న గౌరీకుండ్ నుంచి పంచముఖి డోలి యాత్ర సాయంత్రం కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. 10న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవనున్నారు. అనంతరం భక్తులకు బాబా కేదార్‌నాథ్ దర్శనం కల్పించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram