Lord Shiva | ప్రతి సోమవారం శివుడిని ఇలా పూజించండి.. కష్టాలన్నీ మాయం..!
Lord Shiva | సోమవారం నాడు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే కష్టాలన్నీ మాయమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయని అంటున్నారు.
Lord Shiva | ప్రతి సోమవారం మహా శివుడిని పూజిస్తుంటారు. సోమవారం శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆలయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. సోమవారం నాడు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే కష్టాలన్నీ మాయమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయని అంటున్నారు. శివుడిని భక్తితో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యముంది. ఆ రోజు ప్రారంభం శివుడి పూజతో జరిగితే..వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనం బొట్టు పెట్టాలి.
శివుడి పూజా సమయంలో శివ చాలీసా, శివాష్టకం పఠించాలి. దీనివల్ల భక్తుల కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి. అన్ని కోర్కెలు త్వరగా తీరే అవకాశం ఉంటుంది. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవల్సి వస్తున్నా..సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరుడికి రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమౌతాయి. ధనవర్షం కురుస్తుంది.
శివుడిని పూజించేటప్పుడు బేళపత్రంపై తెల్లటి చందనం రాసి అర్పించాలి. మనస్సులోని కోర్కెలు తీరుతాయి. దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమశ్శివాయ పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కన్పిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram