Ganesh Puja | గణనాథుడిని ఈ పూలతో పూజిస్తే పెళ్లి పక్కా..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!!
Ganesh Puja | వినాయక నవరాత్రులు( Vinayaka Chavithi ) కొనసాగుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా పెళ్లికాని వారు గణనాథుడికి ఆ రంగు పూలతో పూజలు చేస్తే వారికి త్వరగా వివాహం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Ganesh Puja | వినాయక నవరాత్రులు( Vinayaka Chavithi ) కొనసాగుతన్నాయి. ప్రతి గణేశ్ మండపం( Ganesh Pandal ) వద్ద ప్రతి రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గణనాథుడికి ఇష్టమైన ఆకులు, పూలతో పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే అవివాహితులు( Unmarried People ) ఎవరైనా సరే.. ఈ నవరాత్రుల్లో ఎరుపు రంగు పూల( Red Color Flowers ) తో గణనాథుడిని పూజిస్తే.. వారికి తప్పకుండా పెళ్లి అవుతుందని పండితులు పేర్కొంటున్నారు. పారిజాత పుష్పాలు( Parijatha Flower ), తెల్లజిల్లేడు( Tella Jilledu ) పూలతో పూజిస్తే మరింత ఐశ్వర్యం కలిగి, అన్నీ శుభాలే జరుగుతాయని చెబుతున్నారు. మరి ఆ పూల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..
ఎరుపు రంగు పూలు
ప్రకృతిలో సహజంగా ఎరుపు రంగు పూలతో లంబోదరుడిని పూజిస్తే తప్పకుండా అనుగ్రహం కలిగి పెళ్లి అవుతుందట. ఎర్ర గులాబి, ఎర్ర మందారాలతో గణపతిని ఎక్కువగా పూజిస్తే మీరు మనసులో అనుకున్న కోరిక తప్పకుండా ఫలిస్తుందట. గణపతికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
పారిజాత పుష్పం
వినాయకుడిని పారిజాత పుష్పంతో పూజిస్తే.. మన జాతకంలోని 12 రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయట. దీంతో జీవితంలో ఏ పని చేసినా.. విజయం సాధిస్తారట. అవివాహితులకు ఈ పూల పూజ ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
తెల్ల జిల్లెడు పువ్వు
తెల్ల జిల్లెడు ఆకులైనా, పుష్పాలైనా గణనాథుడికి ఎంతో ప్రీతికరం. కాబట్టి తెల్ల జిల్లెడు పుష్పాలతో వినాయకుడిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు. పెళ్లి కూడా త్వరగా అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
సంపంగి పూలు
సంపంగి పూలు చాలా అరుదుగా లభిస్తాయి. అలాంటి సంపంగి పూలతో గణపయ్యను పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయట.
మల్లెపూలు
మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి.. ఆరోగ్యం బాగుంటుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించొచ్చు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.