శ్రీ కనకదుర్గా దేవాలయంలో అమ్మవారికి వైభవంగా గాజుల వేడుక
అశేషంగా తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేసిన మహిళలు విధాత:అనంతపురం సాయి నగర్ 4వ క్రాస్ లో వెలసిన శ్రీ కనకదుర్గా దేవాలయంలో అమ్మవారికి గాజుల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ […]
అశేషంగా తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
విధాత:అనంతపురం సాయి నగర్ 4వ క్రాస్ లో వెలసిన శ్రీ కనకదుర్గా దేవాలయంలో అమ్మవారికి గాజుల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు.

అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ గాజులతోనే తయారు చేసి ముస్తాబు చేయడం విశేషం. ఈసందర్భంగా మహిళలు అశేషంగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గాజులు సమర్పించారు. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. వేడుక ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను ధరించడం శుభకరం.. మంగళకరమని భక్తులు భావించి గాజుల కోసం మరుసటిరోజు దేవస్థానానికి తరలివస్తారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram