Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జలగండం ఉంది.. జర జాగ్రత్త..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఫలప్రదంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థిక లాభాలున్నాయి. ఉద్యోగంలో నూతన పదవులు చేపడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూరదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకోవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం (Leo)
సింహరాశి వారికి మీరు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి అడుగేయాలి. సంపద వృద్ధి చెందుతుంది. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. భాగస్వామ్య ప్రాజెక్టులకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు మీపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే పనులేవి చేయకండి. బంధు మిత్రులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కీలక వ్యవహారాల్లో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు రావడంతో నిశ్చింతగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతులు రావడంతో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సర్దుకుపోయే వైఖరితో మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆనందోత్సాహాలతో ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీ పరుషమైన మాటలతో ఇతరులను గాయపరుస్తారు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. వాదనలు, వివాదాలకు దూరంగా ఉండండి. వృధా ఖర్చులు నివారించండి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులతో సామాజిక హోదా పెరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఇతరుల సహాయంలో, దైవబలంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూలతలు తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బలవంతులతో పోరు మంచిదికాదని గుర్తుంచుకోండి. ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు, ఘర్షణలు లేకుండా చూసుకోండి. శాంతి మార్గం అవలంబిస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.